Telangana: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాలు
ABN, First Publish Date - 2023-06-20T18:12:57+05:30
తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాలు నిర్వహించారు.
ఢిల్లీ: తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాలు నిర్వహించారు. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల వేడుకల్లో ఢిల్లీలోని తెలుగు వారు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా బోనాల వేడుకలు జరిగాయి. డప్పు చప్పులు, నృత్యాలతో కళాకారులు అలరించారు. తెలంగాణ భవన్ కళాకారులకు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అధికారులు స్వాగతం పలికారు.
Updated Date - 2023-06-20T18:12:57+05:30 IST