ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GHMC: రోడ్డు కింద దాన్ని చూసి జీహెచ్ఎంసీ అధికారుల అవాక్కు

ABN, First Publish Date - 2023-02-11T20:17:50+05:30

నగరంలోని చాదర్ఘాట్ ప్రధానరోడ్డులో నాలా బయటపడింది. దాని ప్రభావంతో చాదర్ఘాట్ ప్రధాన రోడ్డులో కుంగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని చాదర్ఘాట్ ప్రధానరోడ్డులో నాలా బయటపడింది. దాని ప్రభావంతో చాదర్ఘాట్ ప్రధాన రోడ్డులో కుంగిపోయింది. కుంగిన రోడ్డును గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ కుంగిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు కింది భాగంలో పెద్ద ఎత్తున నాలా ప్రవాహంను అధికారులు గుర్తించారు. నాలా ప్రవాహంతో ఒక్కసారిగా ప్రధాన రోడ్డు కుంగిపోయింది. ప్రధాన రోడ్డు కింద నాలాని చూసి జీహెచ్ఎంసీ అధికారులు అవాక్కైయారు. అయితే చాదర్‌ఘాట్ ప్రధాన రహదారిపై నిన్న అధికారులు పెద్ద గుంతను గుర్తించారు. రోడ్డు మధ్య గుంత ఏర్పడటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

ఇదిలావుండగా కొద్దిరోజుల క్రితం హిమాయత్‌నగర్‌లోనూ రోడ్డు కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్టానిక స్ట్రీట్ నెంబర్ 5లో వున్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నిలిపివున్న ట్రక్కు పది అడుగుల లోతులో కూరుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

అలాగే గతేడాది డిసెంబర్‌లో గోషామహల్ చాక్నవాడిలోనూ పెద్దనాలా కుంగిపోయింది. ఈ నాలాలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, దుకాణాలు పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 1980, 1990లలో కూడా ఈ నాలా కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. అఫ్సర్ సాగర్, దారుసలాం, చాక్నవాడి , గోషామహల్ పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా మురికి నీరు ప్రవహించనుంది. ఇష్టానుసారంగా ఈ నాలాపై ఆక్రమ నిర్మాణాలు వుండటం వల్లే నాలా కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-11T20:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising