KTR: రైల్వేశాఖ మంత్రి కేటీఆర్ లేఖ.. ప్రస్తవించిన విషయాలు ఇవే
ABN, First Publish Date - 2023-01-30T19:56:15+05:30
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw)కు మంత్రి కేటీఆర్ (KTR) లేఖ రాశారు.
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw)కు మంత్రి కేటీఆర్ (KTR) లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారైనా బడ్జెట్‌లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేటీఆర్ సూచించారు. అలాగే తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల పట్ల కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఒకవైపు కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా... పాత ప్రాజెక్టులను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మోదీ పాలనలో ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. పునర్విభజన చట్టం మేరకైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని లేఖలో ద్వారా కేటీఆర్ తెలిపారు.
Updated Date - 2023-01-30T19:56:17+05:30 IST