ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS High Court: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు ఇచ్చిన రిజిస్టార్

ABN, Publish Date - Dec 15 , 2023 | 05:41 PM

తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.

హైదరాబాద్: తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. 46 కేసులు ప్రజా ప్రతినిధులకు సమన్లు జారీ చేసే దశలో ఉన్నాయని వివరించింది. 10 కేసుల్లో ప్రజా ప్రతినిధుల కేసులపై స్టే ఉందని పేర్కొంది. కాగా ఈ రోజు (శుక్రవారం) నుంచి 2 నెలల లోపు విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హైకోర్ట్ ఆదేశించింది. సంబంధిత పోలీసులు 2 వారాల్లో సమన్లు జారీ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 15 కేసులు ట్రయల్ దశలో ఉన్నాయని, వాటిని త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

5 కేసుల్లో వెంటనే ప్రజా ప్రతినిధుల కేసులపై ఛార్జ్‌షీట్ నంబర్లు దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. మూడు నెలల లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సమర్పించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - Dec 15 , 2023 | 05:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising