K.Viswanath: కె.విశ్వనాథ్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
ABN, First Publish Date - 2023-02-03T01:51:57+05:30
టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Viswanath) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Viswanath) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖ నటుడు జూనియర్ (jr ntr) ఎన్టీఆర్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తెలిసి షాక్‌కు గురయ్యానన్నారు. ఆయన లాంటి దర్శకుడు కన్నుమూయడం తెలుగు సినిమా పరిశ్రమకే తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్‌ది అగ్రస్థానమన్నారు. ఎన్నో అపురూప చిత్రాలు రూపొందించారని పేర్కొన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కె.విశ్వనాథ్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 50కి పైగా సినిమాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం. దర్శకుడిగా ‘ఆత్మగౌరవం’ అనే సినిమాతో 1965లో విశ్వనాథ్ అరంగేట్రం చేశారు. సాగరసంగమం, శంకరాభరణం, స్వర్ణ కమలం, శుభసంకల్పం సినిమాలు విశ్వనాథ్ సినీ జీవితంలో మరపురాని చిత్రాలుగా నిలిచాయి.
Updated Date - 2023-02-03T01:52:00+05:30 IST