ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TPCC: కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర కామెంట్స్.. ఉద్యమకారులే కాంగ్రెస్‌ను గెలిపించారు..

ABN, First Publish Date - 2023-12-07T12:29:52+05:30

నాడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న గ్రామీణ, గిరిజన, దళిత ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి అధికారంలోకి తీసుకువచ్చారని టీపీసీసీ సభ్యుడు,

- టీపీసీసీ సభ్యుడు లకావత్‌ లక్ష్మీనారాయణనాయక్‌

జనగామ: నాడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న గ్రామీణ, గిరిజన, దళిత ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి అధికారంలోకి తీసుకువచ్చారని టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ లకావత్‌ లక్ష్మీనారాయణనాయక్‌(Dr. Lakawat Lakshminarayanayak) అన్నారు. బుధవారం ఆయన జనగామలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల కుటుంబ పాలన అం తం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తెలం గాణ ప్రజలు తీర్చుకున్నారని, ఇక సామాజిక తెలంగాణను చూడబోతున్నామని అ న్నారు. కేసీఆర్‌ అరాచక పాలనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అలుపెరగని పోరాటం చేశారని, ఆయన కృషి వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ చెప్పిన ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలు త్వరలోనే అమలవుతాయని ఆ శాభావం వ్యక్తం చేశారు. ఓటమి ఎరుగని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావును పాలకుర్తిలో 26 ఏళ్ల యశస్వినిరెడ్డి ఓడించడం చరిత్రలో లిఖించదగ్గ విషయ మన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎర్రమల్ల సుధాకకర్‌, చెంచారపు బుచ్చిరెడ్డి, అన్వర్‌, శ్రీనివాసాచారి, గౌస్‌, కొమురయ్య, మేడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-07T12:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising