TS elections: మాకు డబ్బులు ఎప్పుడిస్తారు..?
ABN, First Publish Date - 2023-11-29T09:51:36+05:30
పోలింగ్‌కు ఒక్కరోజే గడువు ఉండడంతో కేపీహెచ్‌బీ(KPHB) ప్రాంతంలో ఓటుకు నోటు గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.
- ప్రధాన పార్టీలకు ఓటర్ల ప్రశ్నలు
- కేపీహెచ్‌బీలో అన్ని పార్టీలకు తలనొప్పులు
కేపీహెచ్‌బీ(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌కు ఒక్కరోజే గడువు ఉండడంతో కేపీహెచ్‌బీ(KPHB) ప్రాంతంలో ఓటుకు నోటు గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ ఓటరు స్లిప్పులతోపాటు రూ.1000, రూ.2000 చొప్పున ఇచ్చారని, ఈసారి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇస్తారని చర్చ జరుగుతోంది. కానీ, ఓటర్ల పేరు చెప్పి ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు డబ్బులు తీసుకున్నారా? లేక ఎన్నికల ముందురోజు లేదా అదేరోజు ఇస్తారా? అంటూ పోటీలో ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్, జనసేన నాయకులను ఓటర్లు అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కేపీహెచ్‌బీలో మూడు, నాలుగోఫేజ్‌లకు మాత్రమే డబ్బులు ఇచ్చే సంస్కృతి ఉండగా.. తాజాగా అన్ని ప్రాంతాల్లోని ఓటర్లు మేము ఏం పాపం చేశాం? మాకు ఎందుకు ఓటుకు డబ్బులు ఇవ్వరు అని ప్రశ్నించే స్థాయికి ఓటరు ఎదిగాడు. ఈసారి ఓటుకు ధర ఎంత? అనేది ఏ పార్టీ కూడా అవసరాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అప్పటికప్పుడు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఓటరు డబ్బులు ఇచ్చిన వారికి వేస్తారా? నచ్చిన పార్టీ/అభ్యర్థికి ఓటు వేస్తారా అన్నది వేచి చూడాలి.
Updated Date - 2023-11-29T09:51:38+05:30 IST