ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR Govt : కేసీఆర్ మరో ఎలక్షన్ స్టంట్.. ఆగస్టు-15 వేళ తియ్యటి శుభవార్త!

ABN, First Publish Date - 2023-08-14T21:51:40+05:30

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే పలు కీలక హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ రైతులకు తీపి కబురు చెప్పారు. రైతులకు రూ.లక్ష లోపు (రూ.99,999) వరకు రుణమాఫీని పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్. దీంతో రాష్ట్ర రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సోమవారం ఒక్కరోజే.. 10,79,721 మంది రైతులకు రూ. 6,546.05 కోట్ల రుణమాఫీ చేసింది...

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే పలు కీలక హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ రైతులకు తీపి కబురు చెప్పారు. రైతులకు రూ.లక్ష లోపు (రూ.99,999) వరకు రుణమాఫీని పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్. దీంతో రాష్ట్ర రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సోమవారం ఒక్కరోజే.. 10,79,721 మంది రైతులకు రూ. 6,546.05 కోట్ల రుణమాఫీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును సోమవారం నాడే ఆర్థికశాఖ జమ చేసింది. కాగా.. ఇవాళ్టి రుణమాఫీతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం 16.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ పూర్తి చేసింది. ఇప్పటి వరకూ మొత్తంగా రూ.7,753 కోట్లను రుణామాఫీకి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది.


ఇప్పటి వరకూ ఇలా..!

కాగా.. ఆగస్టు-02న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే అనగా ఆగస్టు-03 నుంచే రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఉన్నాధికారులను గులాబీ బాస్ ఆదేశించారు. మొదటిరోజు.. రూ.41వేల లోపు 62,758 మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మొత్తానికి చూస్తే.. రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పడానికి కేసీఆర్ సర్కార్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ మాఫీపై రైతు సంఘాలు, ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!


YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!


Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?


Chandrababu : హిమాచల్ పర్యటనలో బిజిబిజీగా చంద్రబాబు.. గవర్నర్ దత్తన్నతో భేటీ


Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..


Updated Date - 2023-08-14T21:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising