TSPSC Leakage Case: నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

ABN, First Publish Date - 2023-03-25T18:45:51+05:30

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్‌ కేసుపై నాంపల్లి కోర్టు (Nampally Court)లో విచారణ జరిగింది. నలుగురు నిందితులను 3 రోజుల కస్టడీ (Custody)కి కోర్టు అనుమతిచ్చింది.

TSPSC Leakage Case: నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్‌ కేసుపై నాంపల్లి కోర్టు (Nampally Court)లో విచారణ జరిగింది. నలుగురు నిందితులను 3 రోజుల కస్టడీ (Custody)కి కోర్టు అనుమతిచ్చింది. ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా, ఏ5 రాజేశ్వర్‌కు కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. ఆదివారం (రేపు) నుంచి మంగళవారం వరకు నిందితులను సిట్ విచారించనుంది. ఈ కేసులో ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్‌ కస్టడీ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో మొత్తం 19మంది సాక్ష్యులను సిట్ విచారించింది. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మిని సిట్ సాక్షులుగా చేర్చింది. ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్‌లను అలాగే కర్మన్ ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని, సిబ్బందిని సిట్ సాక్ష్యులుగా చేర్చింది. ఈ నెల 4న ఆర్ స్క్వేర్ హోటల్‌లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్‌లో నిందితులు రెండు రూంలు తీసుకున్నారు. ఆర్ స్క్వేర్ హోటల్‌‌లో 107, 108 రూంలలో ప్రశ్నాపత్రం చూసి ప్రిపేర్ అయిన ఇద్దరు నిందితులు... తర్వాత నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. హోటల్‌లో సీసీ కెమెరాలతో పాటు, సిబ్బంది వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసుకుంది.

Updated Date - 2023-03-25T18:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising