ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు

ABN, First Publish Date - 2023-04-13T14:49:56+05:30

సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కేసు సమాచారం ఇవ్వాలని సిట్‌ను ఈడీ కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కేసు సమాచారం ఇవ్వాలని సిట్‌ను ఈడీ కోరింది. ESIR నమోదు చేసిన తరువాత కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్‌ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఈడీ దర్యాప్తునకు సిట్ సహకరించక పోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా.. మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి కాన్ఫెడన్సిల్ రూమ్ కస్టోడీయన్ శంకర్ లక్ష్మీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణ వెళ్లనున్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఆర్థిక మూలలను వెతికే పనిలో ఈడీ ఉంది. ఈడీ నోటీసులు అందినప్పటికీ ఇద్దరు నిన్న హాజరుకాకపోవడం.. ఇవాళ హాజరవుతుండడంపై ఉత్కంఠ నెలకొంది. ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్‌మెంట్స్ కోసం నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ కోరనుంది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి, ECIR నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది. 40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది.

Updated Date - 2023-04-13T14:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising