ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanthi: మంచినీళ్లలా ఖర్చు చేసే స్థాయి ఉంటేనే టికెట్..!

ABN, First Publish Date - 2023-05-02T22:45:58+05:30

కోట్ల వరకూ మంచినీళ్లలా ఖర్చు చేసే స్థాయి ఉంటే తప్ప టికెట్ దక్కని దుస్థితి నెలకొందని ఆమె విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎన్నికల వ్యయంలో తప్ప.. (Election Expenditure) మరెక్కడా కానిపించని పరిస్థితిని సీఎం కేసీఆర్ (CM KCR) తీసుకొచ్చారని బీజేపీ నాయకురాలు విజయశాంతి (BJP leader Vijayashanthi) ఆరోపించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ. 40 నుంచి రూ. 50 కోట్లు... ఎంపీగా పోటీకి దిగాలంటే రూ. 70 నుంచి రూ. 80 కోట్ల వరకూ మంచినీళ్లలా ఖర్చు చేసే స్థాయి ఉంటే తప్ప టికెట్ దక్కని దుస్థితి నెలకొందని ఆమె విమర్శించారు.

రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..

'తెలంగాణలో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుందా... అని వెదికితే, కేవలం ఎన్నికల వ్యయంలో తప్ప మరెక్కడా కానిపించని పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలంటే కనీసం 40 నుంచి 50 కోట్లు... ఎంపీగా పోటీకి దిగాలంటే ఆ పైన దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకూ మంచినీళ్లలా ఖర్చు చేసే స్థాయి ఉంటే తప్ప టికెట్ దక్కని దుస్థితి. వార్డు కౌన్సిలర్లు, కార్పోరేటర్ల పదవులకి పోటీపడేవారు సైతం లక్షలు, కోట్లు సిద్ధం చేసుకోవాల్సిందే... ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ గారు తాము ప్రవేశపెట్టిన పథకాలని అభివృద్ధిగా చూపించుకోవడం విడ్డూరంగా ఉంది. నిరుద్యోగభృతి ఎందరు నిరుద్యోగులకు అందిందో చెప్పాల్సిన పని లేదు... దళితబంధులో జరుగుతున్న దగా గురించి మీడియాలో రోజూ చదువుతున్నాం. అదే బాటలో రైతుబంధు పథకం కూడా... ఇక బిల్లులు రాక పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు, ఆత్మహత్యలకు సైతం పాల్పడిన ప్రజాప్రతినిధుల గురించి తల్చుకుంటే కడుపు రగిలిపోతోంది. అలాగే... అర్హులకంటే అనర్హులకే ఎక్కువ కేటాయించి, చివరికి నిధుల్లేక మోసగించిన డబుల్ బెడ్రూంలది మరో కథ... తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో మిగులు నిధులతో కళకళలాడిన రాష్ట్రాన్ని ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచెత్తారు. ఇప్పుడు దేశాన్ని సైతం అదే బాటలో నడిపించడానికి టీఆరెస్ నుంచి బీఆరెస్ అవతారమెత్తారు పాలకులు. తెలంగాణలో ఇలా అభివృద్ధి అర్థాన్నే మార్చేసిన ఘనత కేసీఆర్ గారి సర్కారుకే దక్కుతుంది.' అని విజయశాంతి అన్నారు.

Updated Date - 2023-05-03T15:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising