TS News: వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం
ABN, First Publish Date - 2023-07-14T09:35:57+05:30
జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌లోని ఓ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది.
వరంగల్: జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌లోని ఓ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు ఉన్న సమయంలో ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్ వద్ద రేకుల షెడ్డుపై ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వాటర్ ట్యాంక్ పడిపోడానికి గల కారణాలపై రైల్వే సిబ్బంది ఆరా తీస్తున్నారు.
Updated Date - 2023-07-14T09:35:57+05:30 IST