ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్ జిల్లాలో కరోనా కలకలం...

ABN, First Publish Date - 2023-04-19T12:17:10+05:30

మహబూబాబాద్: జిల్లాలో కరోణ కలకలం (Corona Kalakalam) రేపుతోంది. గార్ల మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 14 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటీవ్‌గా నిర్ణారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలో కరోణ కలకలం (Corona Kalakalam) రేపుతోంది. గార్ల మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 14 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటీవ్‌గా నిర్ణారణ అయింది. బాధితులను అక్కడే క్వారంటైన్ (Quarantine) చేసి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తొర్రూరు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal Dist.)లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా విద్యా సంస్థల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలంలోని ఓ ప్రైవేటు స్కూలు హాస్టల్‌లో కరోనా విజృంభించింది. హాస్టల్‌లో అస్వస్థతకు చెందిన ముగ్గురు విద్యార్థులను ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకువెళ్లగా.. అందులో ఇద్దరికి పాజిటీవ్ వచ్చింది. దీంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులందరికీ పరీక్షలు చేయగా 14 మంది విద్యార్థులు, నలుగురు సిబ్బంది.. మొత్తం 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు తొర్రూరులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అస్వస్తతకు గురైనా విద్యార్థులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా కొంతమందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. మొత్తం స్కూల్లో ఉన్న 70 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా వారిలో 8 మంది విద్యార్థులు, ఒక టీచర్‌కు పాటిటీవ్‌గా నిర్ణారణ అయింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

మహబూబాబాద్‌ జిల్లాలోని వివిధ హాస్టళ్లలో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. 15 రోజుల్లో నాలుగు హాస్టళ్లలో 45 మందికి కరోనా సోకింది. దీంతో పిల్లలు మానసికంగా బాధపడుతూ పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నారు. వేసవి ఆరంభం ఏప్రిల్‌ నుంచే విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్న క్రమంలో భౌతిక దూరం పాటించకుండ సామూహికంగా ఉండే హాస్టళ్లలోనే కరోనా పరీక్షలు పెడుతోంది. మూకుమ్మడిగా వాష్‌రూంలు, టాయిలెట్‌లు, కిచెన్‌లు కలిసి వాడడం, ఒక్కొ గదిలోనే విద్యార్థులు కలిసిమెలిసి ఉండడం.. అపరిశుభ్రత వెరసి కరోనా వ్యాప్తికి కారణమని వైద్యా ఆరోగ్యశాఖ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. హాస్టళ్లలో మాత్రం దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు వెలుగులోకి రాగానే అప్రమత్తమై సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం కావడం, ప్రత్యేక క్యాంపు నిర్వహించి కరోనా టెస్టుల ద్వారా పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసో లేషన్‌ గదిలో ఉంచడం, ప్రత్యేక వైద్యం అందించడంతో పాటు స్థానిక మునిసిపల్‌, గ్రామపంచాయతీల ద్వారా ఆయా హాస్టళ్లలో బ్లీచింగ్‌ చల్లించి క్లాస్‌రూంలు, వాష్‌రూంలు, టాయిలెట్‌లు, శుభ్రం చేయడం, ఒకశాతం హైపోక్లోరైడ్‌ పిచికారి చేయడం లాంటివి చేపడుతూ.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు.

Updated Date - 2023-04-19T12:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising