ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Preethi Case : మెడికల్ కళాశాలల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

ABN, First Publish Date - 2023-02-27T10:54:02+05:30

వరంగల్ కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : వరంగల్ కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తు్న్నారు. విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ధారావత్‌ ప్రీతి కథ విషాదాంతమైంది. ఐదు రోజలుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో మృత్యువుతో చేస్తున్న పోరాటంలో ప్రీతి ఓడిపోయింది. డాక్టర్ల బృందం చివరి నిమిషం వరకు ఎంత ప్రయ త్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం ఆమె కన్నుమూసింది. ప్రీతి మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్తతో కేఎంసీలోని వైద్య విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంజీఎం ఆస్పత్రిలోనూ సీనియర్‌ డాక్టర్లు, పీజీలు, హౌస్‌సర్జన్లు సైతం విషాదంలో మునిగిపోయారు. అయితే.. నేటి తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తైన వెంటనే ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం..మొండ్రాయి గిర్నితండాకి తరలించారు. మరికాసేపట్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

22న ఆత్మహత్యాయత్నం..

ఎంజీఎంలోని అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి తన సీనియర్‌ పీజీ విద్యార్ధి ఎంఏ సైఫ్‌ వేధింపులు భరించలేక మత్తుకు సంబంధించిన ఒక ఇంజక్షన్‌ తీసుకోవడం ద్వారా ఈనెల 22న ఉదయం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను మొదట ఎంజీఎం ఆస్పత్రిలోనే అత్యవసర చికిత్స అందిం చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందింది. నిమ్స్‌లో చేర్చినప్పటి నుంచి ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ప్రత్యే క బృందం ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయ త్నం చేశారు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంత కంతకూ క్షీణిస్తూ వచ్చింది. శనివారం నుంచి ఆమె శరీరం రంగు మారుతూ వచ్చింది.

Updated Date - 2023-02-27T11:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising