TS Election: రాహుల్ ర్యాలీలో అపశృతి.. బైక్ నడుపుతూ కిందపడ్డ కొండా సురేఖ
ABN, First Publish Date - 2023-10-19T14:03:03+05:30
రాహుల్‌గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ
భూపాలపల్లి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ బైక్ నడుపుతూ కిందపడిపోయారు. స్వల్ప గాయాలతో సురేఖ బయటపడ్డారు. రాహుల్ ర్యాలీలో కార్యకర్తలంతా బైక్ ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు.
Updated Date - 2023-10-19T14:29:03+05:30 IST