Mandakrishna Madiga: ప్రీతిది హత్యా, ఆత్మహత్యా..?
ABN, First Publish Date - 2023-03-05T12:22:34+05:30
ప్రీతిది (preethi medico) హత్యా, ఆత్మహత్యా..? అనేది తేలకుండానే ఆత్మహత్యాయత్నం కేసు
హనుమకొండ: ప్రీతిది (preethi medico) హత్యా, ఆత్మహత్యా..? అనేది తేలకుండానే ఆత్మహత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మందకృష్ణ(Mandakrishna) మాట్లాడుతూ.. ప్రీతిది ఆత్మహత్యాయత్నం అని చెప్పడానికి ఆధారాలు లేవు..అప్పుడే కేసు పక్కదారి ఎలా పట్టిందని ప్రశ్నించారు. మెడికో ప్రీతి మృతి కేసుపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రియాంక రెడ్డికి జరిగిన న్యాయమే ప్రీతికి జరగాలని డిమాండ్ చేశారు. ప్రీతి మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రీతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని మందకృష్ణ తెలిపారు. ప్రీతి మృతి కేసును హత్య కేసుగా మార్చాలని, వెంటనే జుడీషీయరీ విచారణ జరపాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.
Updated Date - 2023-03-05T12:29:58+05:30 IST