ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tatikonda Rajaiah: రాజయ్యను కలిసేందుకు వచ్చిన పల్లా.. నిరాకరించిన ఎమ్మెల్యే!

ABN, First Publish Date - 2023-08-23T16:52:46+05:30

ఇదిలా ఉంటే బుధవారం రాజయ్యను కలిసేందుకు సీఎం కేసీఆర్ దూతగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. కానీ రాజయ్య మాత్రం పల్లాను కలిసేందుకు ససేమిరా అన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అందుబాటులో లేరంటూ చెప్పడంతో

హన్మకొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మరోసారి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను ఈసారి కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో రాజయ్య మనోవేదనకు గురయ్యారు. మంగళవారం కార్యకర్తలు, అభిమానులు వచ్చినప్పుడు రాజయ్య ఎక్కి ఎక్కి ఏడ్చారు. బాధనంతా దు:ఖం రూపంలో చూపించారు. కార్యకర్తలను విడిచి ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వచ్చిన అభిమానులు కూడా ఎమ్మెల్యేను పట్టుకుని ఏడ్చేశారు.

ఇదిలా ఉంటే బుధవారం రాజయ్యను కలిసేందుకు సీఎం కేసీఆర్ దూతగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. కానీ రాజయ్య మాత్రం పల్లాను కలిసేందుకు ససేమిరా అన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అందుబాటులో లేరంటూ చెప్పడంతో స్థానిక కార్యకర్తలు, రాజయ్య ముఖ్య అనుచరులతో భేటీ అయి నచ్చజెప్పినట్లుగా సమాచారం. రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పుకొచ్చారంట!. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి రాజయ్య గురించి చర్చిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. రాజయ్య మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకోవడంతో.. ఎమ్మెల్యేను ఓదార్చడానికి పల్లా వెళ్లినట్లు సమాచారం. కానీ రాజయ్య మాత్రం కలిసేందుకు నిరాకరించడంతో పల్లా వెనుదిరిగినట్లు తెలుస్తోంది.

అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి టికెట్ ఆశించారు. కానీ సీఎం కేసీఆర్.. తుమ్మలకు టికెట్ నిరాకరించారు. దీంతో తుమ్మల అనుచరులు మంగళవారం సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ దూతగా ఎంపీ నామా నాగేశ్వరరావు.. తుమ్మలను కలిసి తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తుమ్మల కాంగ్రెస్‌లోకి వెళ్తారని చర్చ నడుస్తోంది. ఏం జరగబోతుందో కొన్ని రోజుల్లో వేచి చూడాలి.

సోమవారం సీఎం కేసీఆర్.. 115 మంది కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Updated Date - 2023-08-23T17:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising