ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharmila: ఈసారి బడ్జెట్.. కొత్త సీసాలో పాత సార పోసినట్లు ఉంది..

ABN, First Publish Date - 2023-02-07T11:35:28+05:30

రాష్ట్ర బడ్జెట్(State budget) 2023-24 కొత్త సీసాలో పాత సార పోసినట్లు ఉందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: రాష్ట్ర బడ్జెట్(State budget) 2023-24 కొత్త సీసాలో పాత సార పోసినట్లు ఉందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YSRTP President Sharmila) ఎద్దేవ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర(Praja Prasthanam Padayatra)లో మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ‘‘కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్‎కి వెళ్ళారు. అందులో ఆయన మామ పాత సార పోశారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు మీద సమాధానం చెప్పాలి. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.12వేల కోట్లు కేటాయించారు. ఈసారి దళిత బంధుకు రూ. 17 వేల కోట్లు పెట్టారు. అసలు కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదు. గతేడాది బడ్జెట్‎ను కాపీ పేస్ట్ చేశారు. ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా..? పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టక పోతే ఎందుకు..? బడ్జెట్‎ను వేస్ట్ పేపర్ చేస్తున్నారు. చెత్తబుట్టలో పడేసెలా చేస్తున్నారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి(Chief Minister KCR) ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. సీఎం(CM) అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండదా..? సీఎం మాటలు మాత్రం కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవు’’ అని తీవ్రస్థాయిలో షర్మిల మండిపడ్డారు.

Updated Date - 2023-02-07T11:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising