ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth reddy: సోనియా టూర్‌కు కేసీఆర్, మోదీ అడ్డంకులు సృష్టిస్తున్నారు

ABN, First Publish Date - 2023-09-13T18:58:17+05:30

కేవీపీ.. కేసీఅర్‌తో కలిసిన ఫోటోలు త్వరలోనే విడుదల చేస్తా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా చిన్నజీయర్ స్వామి కాళ్లదగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా?, తెలంగాణ అమరవీరుల స్థూపం

వరంగల్: తెలంగాణలో సోనియా గాంధీ (Sonia Gandhi) పర్యటనకు సీఎం కేసీఆర్ (Cm kcr), ప్రధాని మోదీ (pm modi) అడ్డంకులు సృష్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) ఆరోపించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘కిషన్‌రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా సెప్టెంబర్ 17న వరంగల్‌లో సభ పెడతామన్నారు. కానీ సోనియా గాంధీ అదే రోజు హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిసి అమిత్ షా పర్యటన హైదరాబాద్‌కు మార్చుకున్నారు. పరేడ్ గ్రౌండ్, గచ్చిబౌలి స్టేడియం, తుక్కుగూడలో కూడా సోనియా సభకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సోనియాగాంధీ సభకు అనుమతి ఇవ్వడంలేదు. ప్రభుత్వమే లాంఛనంగా లక్షలాది మందితో స్వాగతం పలకాలి కానీ... ముఖ్యమంత్రి నీచుడు కాబట్టే సభకు అనుమతి ఇవ్వడం లేదు. చివరకు తుక్కగూడ రైతులే ముందుకు వచ్చి సభకు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. సోనియాగాంధీ సభకు నియోజకవర్గానికి 25 వేల మంది తరలి రావాలి. నాయకులు విభేదాలు పక్కనబెట్టి కార్యకర్తలను సభకు తీసుకురావాలి. కార్యకర్తలను తీసుకురాలేనివారు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. కేసీఆర్ రాక్షసుడు, మోదీ బ్రహ్మరాక్షసుడు. సద్దన్నం తిని, సద్ది కట్టుకుని కాంగ్రెస్ విజయభేరి సభకు తరలిరండి..’’ అని రేవంత్ రెడ్డి కోరారు.

ఫొటోలు విడుదల చేస్తా

‘‘కేవీపీ.. కేసీఅర్‌తో కలిసిన ఫోటోలు త్వరలోనే విడుదల చేస్తా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా చిన్నజీయర్ స్వామి కాళ్లదగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా?, తెలంగాణ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా ఆంధ్రా వాళ్లకు ఇచ్చారు. నీ పార్టీలో తెలంగాణ పేరు తీశావ్... తెలంగాణతో నీకేం సంబంధం కేసీఆర్.’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-09-13T18:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising