Water: వామ్మో.. ఈ నీటిని ఎలా తాగేది..
ABN, Publish Date - Dec 14 , 2023 | 10:45 AM
గౌలిపురా డివిజన్(Gaulipura Division)లో మంచినీటికి బదులు కలుషిత నీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు
- పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): గౌలిపురా డివిజన్(Gaulipura Division)లో మంచినీటికి బదులు కలుషిత నీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నీటిని ప్రజలు తాగలేక రోగాల బారిన పడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని జలమండలి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌలిపురా డివిజన్‌లోని కుమ్మర్‌వాడి, హనుమాన్ నగర్, దానయ్యనగర్, సర్దార్ పటేల్ నగర్, అంబికానగర్ తదితర బస్తీల్లో నెలరోజులుగా మురుగునీరు సరఫరా అవుతోంది.
శిథిలావస్థకు చేరిన పైపులైన్
డివిజన్ పరిధిలో డ్రైనేజీ పైపులైన్ శిథిలావస్థకు చేరడంతో మురగునీరు మంచినీటి పైపులైన్‌లో కలుస్తోంది. ఈ విసయంపై స్థానిక కార్పొరేటర్ జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. సమయ పాలన లేకుండా నీటి సరఫరా చేస్తున్నారన్నారు.
మా గోస వినరా?
గౌలిపురా డివిజన్‌లో కలుషిత నీరు సరఫరా అవుతోందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేశాం. అయినా స్పందన లేదు.
- జి.వికాస్, స్థానికుడు
Updated Date - Dec 14 , 2023 | 10:45 AM