South Central Railway: ద.మ. రైల్వేకు ఈ ఏడాది ఎంత ఆదాయం వచ్చిందంటే..
ABN, First Publish Date - 2023-04-17T16:00:23+05:30
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway)కు ఈ ఏడాది వచ్చిన ఆదాయం వివరాలను జీఎం అరుణ్కుమార్ (GM Arun Kumar) వెల్లడించారు.
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway)కు ఈ ఏడాది వచ్చిన ఆదాయం వివరాలను జీఎం అరుణ్కుమార్ (GM Arun Kumar) వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వేకు ఫ్రైట్ ద్వారా రూ.13,051 కోట్లు, ప్యాసింజర్ల ద్వారా ఈ ఏడాది ఆదాయం రూ.5,140 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. గతేడాది మొత్తం ఆదాయం రూ.14,266 కోట్లు వస్తే.. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ.18,973 కోట్ల వచ్చిందని ఆయన వివరించారు. ఈ ఏడాది 49.8 కిలోమీటర్ల కొత్త లైన్లు, 151 కిలోమీటర్లు డబ్లింగ్, 182 కిలోమీటర్ల థ్రిప్లింగ్ లైన్లు పూర్తి చేశామని అరుణ్కుమార్ పేర్కొన్నారు. 1017 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేశామని, గంటకు 130 కిలోమీటర్ల వేగంను అందుకున్నామని వివరించారు. ఖాజీపేట-సికింద్రాబాద్ (Khajipet Secunderabad) రూట్లో ఈ స్పీడ్తో రైలు నడిపించామని తెలిపారు. టికెట్ చెకింగ్ ద్వారా ఈ ఏడాది రూ.215 కోట్లు, స్క్రాప్ అమ్మకం ద్వారా ఈ ఏడాది రూ.391 కోట్లు ఆదాయం వచ్చిందని ప్రకటించారు.
‘‘2021-22లో 127 మిలియన్ ప్యాసింజర్లు ప్రయాణిస్తే.. ఈ ఏడాది ఆ సంఖ్య 255 మిలియన్లకు పెరిగింది. జనవరి 2024లోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ తెస్తాం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు వ్యయం రూ.1169 కోట్లు అయితే.. తెలంగాణ వాటా రూ.779కోట్లు, కేంద్రం వాటా రూ.390 కోట్లు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.379 కోట్లు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాది బడ్జెట్లోనూ రూ.600 కోట్లు విడుదల చేసింది. ఆగస్ట్, సెప్టెంబర్ నాటికి సిద్దిపేటకు రైల్ సౌకర్యం లభిస్తుంది’’ అని జీఎం అరుణ్కుమార్ ప్రకటించారు.
Updated Date - 2023-04-17T16:00:23+05:30 IST