ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Talasani: మోదీ మాకు నీతులు చెబుతారా?: తలసాని

ABN, First Publish Date - 2023-04-08T16:04:50+05:30

ప్రధాని మోదీ (Prime Minister Modi) హైదరాబాద్ పర్యటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ప్రధాని మోదీ (Prime Minister Modi) హైదరాబాద్ పర్యటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శలు గుప్పించారు. రాజకీయ అజెండాతోనే ప్రధాని పర్యటన జరిగిందని తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)పై మోదీ తప్పుడు విమర్శలు చేశారని, అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం తగదని సూచించారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. కేంద్రానికి తెలంగాణ నుంచే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిపై తమకు నీతులు చెబుతారా? అని ప్రశ్నించారు. వందేభారత్ రైలు (Vande Bharat train)ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారని విమర్శించారు. సింగరేణిని పారిశ్రామికవేత్త ఆదానీ (Adani)కి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎలా ఇచ్చింది? అని తలసాని ప్రశ్నించారు. తెలంగాణకు అవార్డులు మాత్రమే ఇస్తున్నారని, నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. బీబీనగర్ ఎయిమ్స్ మోదీ కట్టించారా? అని ప్రశ్నించారు. అదానీపై జేపీసీ వేయడానికి మోదీ భయపడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు.

మోదీ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేంటి..? అసలు ఆయన ఎందుకొచ్చారు..? ఏం చేశారు..? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కనీసం ఈసారైనా రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన ఉంటుందని ఆశించాము కానీ మళ్లీ మళ్లీ ప్రధాని మోదీ ఉసూరు మనిపించారని గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ ఓర్చుకోవడం లేదని మండిపడుతున్నారు. నెలకోసారి ప్రధాని మోదీ, వారానికో కేంద్ర మంత్రి తెలంగాణ వచ్చి ఏం చేస్తున్నారు..? ఏం తెస్తున్నారు..? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫైనల్‌గా ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-04-08T16:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising