ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అగ్ని... ఓ దివ్యాస్త్రం

ABN, Publish Date - Mar 12 , 2024 | 02:21 AM

దేశానికి అగ్ని - 5 క్షిపణి రూపంలో దివ్యాస్త్రాన్ని అందించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): దేశానికి అగ్ని - 5 క్షిపణి రూపంలో దివ్యాస్త్రాన్ని అందించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి పనితీరు తెలుసుకుంటే దేశం గర్వించదగిన ఆవిష్కరణగా చెప్పక తప్పదు. ఐదు వేల కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఈ అస్త్రం ఛేదించడం మన దేశ రక్షణ వ్యవస్థకు అనితరమైన బలాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ ఆమెరికా, ఇంగ్లాండ్‌, రష్యా, ప్రాన్స్‌, చైనా మాత్రమే ఇటువంటి ఆయుధ వ్యవస్థ కలిగి ఉండగా ఇప్పుడు భారత్‌ వీటి సరసన చేరింది. ఇది మన శాస్త్రవేత్తల నైపుణ్యానికి నిదర్శనం. అంతరిక్ష ప్రయోగాల్లో అనేక విజయాలు సొంత చేసుకుంటున్న మన దేశం ఇప్పుడు క్షిపణి పరిజ్ఞానంలో మరో మెట్టు పైకి వెళ్లింది. దీని వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ, ప్రధాని మోదీ దార్శనికత, అవిరాళ కృషి దాగి ఉన్నాయి. ఈ విజయాన్ని దేశ ప్రజలకు అందించిన శాస్త్రవేత్తలకు అభినందనలు’ అని పవన్‌ అన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 10:42 AM

Advertising
Advertising