Ambati Rambabu: అంబటిపై భూకబ్జా ఆరోపణలు
ABN, Publish Date - Feb 02 , 2024 | 10:16 AM
మంత్రి అంబటి రాంబాబుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంబటిపై అవినీతి ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. తాజాగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వినవస్తున్నాయి.
పల్నాడు: మంత్రి అంబటి రాంబాబుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంబటిపై అవినీతి ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. తాజాగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వినవస్తున్నాయి. కొత్తపల్లి విజయప్రసాద్ అనే వ్యక్తి తమ స్థలాన్ని అంబటి రాబాబు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు.
అంబటి రాంబాబు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రెండు ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన కొత్తపల్లి విజయ ప్రసాద్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 298/2 లోని భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పొలం తమ నాయనమ్మ సరోజనమ్మదని విజయ ప్రసాద్ చెబుతున్నారు.
2013లో కొందరు తప్పుడు డాక్యుమెంట్‌లు సృష్టించారన్నారని వెల్లడించారు. 2014లో ఈ కబ్జా వ్యవహారంపై కోర్టుకు వెళ్లామని... కేసు నడుస్తోందని కొత్తపల్లి విజయ ప్రసాద్ తెలిపారు. 2022న అంబటి రాంబాబు తమ పొలం తప్పుడు రిజిస్ట్రేషన్‌తో కబ్జా చేశాడన్నారు. అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. మంత్రి అంబటి రాంబాబు నుంచి తమకు ప్రాణహాణి ఉందని విజయ ప్రసాద్ తెలిపారు.
Updated Date - Feb 02 , 2024 | 10:17 AM