POLL : పోలింగ్‌కు 241 కేంద్రాలు
ABN, Publish Date - May 13 , 2024 | 12:05 AM
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2,10,804 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,06, 242 మంది, మహిళలు 1,04, 831 మంది ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు సోమవారం జరుగనున్న ఎన్నికల్లో వా రు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అమరాపురం మండలంలో 46,919 మంది, గుడిబండలో 43,160 మంది, రొళ్ల మండలంలో 30,677 మంది, అగళిలో 26,682 మంది, మడకశిర రూరల్ పరిథిలో 46,432 మంది, మడకశిర అర్బన పరిధిలో 17,204 మంది ఓటర్లు ఉన్నారు.
మడకశిర, మే 12: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2,10,804 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,06, 242 మంది, మహిళలు 1,04, 831 మంది ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు సోమవారం జరుగనున్న ఎన్నికల్లో వా రు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అమరాపురం మండలంలో 46,919 మంది, గుడిబండలో 43,160 మంది, రొళ్ల మండలంలో 30,677 మంది, అగళిలో 26,682 మంది, మడకశిర రూరల్ పరిథిలో 46,432 మంది, మడకశిర అర్బన పరిధిలో 17,204 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అమరాపురం మండలంలో పురుషులు 23,530, మహిళలు 23,389 మంది, గుడిబండలో పురుషులు 21,809, మహిళలు 21,351 మంది, రొళ్లలో పురుషులు 15,660, మహిళలు 15017 మంది, అగళిలో పురుషులు 13,463, మహిళలు 13,219 మంది, మడకశిర రూరల్ లో పురుషులు 23,357, మహిళలు 23,074 మంది, మడకశిర అర్బన పరిధిలో పురు షులు 8,423, మహిళలు 8,781 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సమస్య లేని పోలింగ్ కేంద్రాలు 195 , సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 42, వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉన్న పోలింగ్ కేంద్రాలు 147 దాకా ఉన్నాయి.
మడకశిర టౌన: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మడకశిర డిగ్రీ కళాశాల అవరణంలో ఆదివారం ఎన్నికల సిబ్బందికి పో లింగ్ సామగ్రి అందించారు. మడకశిర నియోజకవర్గంలో అగళి, రొళ్ల, గుడిబండ, అమరాపురం, మడకశిర మండలాల పరిధిలో 241 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఓ గౌరీశంకర్ తెలిపారు. పీఓలు ఏపీఓలు కలిపి 1446 మంది సిబ్బందిని నియమించామని, 20 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచామన్నారు. ఒక డీఎస్పీ, సీఐ, పది మంది ఎస్‌ఐలు, మొత్తం 450 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు సీఐ మనోహర్ తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బందికి ఈవీ ఎంలు, ఎన్నికల సామాగ్రిని అందజేశారు. పోలింగ్ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. పోలింగ్‌కు తరలివెళ్లే సిబ్బందికి బస్సుల సౌకర్యం కల్పించారు.
గుడిబండ: సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేసినట్లు తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మండలంలో 47 పోలింగ్ కేంద్రాల్లో 42,954మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 13 , 2024 | 12:05 AM