BLOOD DONOR : రక్తదాత.. నిజమైన హీరో
ABN, Publish Date - Jun 14 , 2024 | 11:36 PM
రక్తమిచ్చి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడగలిగిన రక్తదాత నిజమైన హీరో అని జిల్లా కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక పాతూరు సీడీ ఆస్పత్రిలో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాల నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు అందజేసి, సత్కరించారు. అనంతరం వేడుకలనుద్దేశించి కలెక్టరు మాట్లాడుతూ.. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు హిరోనే అన్నారు. జిల్లాలోని ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని ...
కలెక్టరు వినోద్‌కుమార్
అనంతపురంటౌన, జూన 14: రక్తమిచ్చి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడగలిగిన రక్తదాత నిజమైన హీరో అని జిల్లా కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక పాతూరు సీడీ ఆస్పత్రిలో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాల నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు అందజేసి, సత్కరించారు. అనంతరం వేడుకలనుద్దేశించి కలెక్టరు మాట్లాడుతూ.. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు హిరోనే అన్నారు. జిల్లాలోని ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో కూడా పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి అత్యవసర సమయాల్లో సాటి మనిషికి సమస్య లేకుండా అందజేయాలని నిర్వాహకులకు కలెక్టరు సూచించారు. రక్తదానానికి తనవంతు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ మేఘస్వరూప్, అసిస్టెంట్ కలెక్టరు వినూత్న, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రెడ్‌క్రా్‌స సంస్థ చైర్‌పర్సన కాపు భారతి, సొసైటీ సభ్యులు, రక్తదాన నిర్వాహకులు, రక్తదాతలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jun 14 , 2024 | 11:36 PM