ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

HOSPITAL : ఆస్పత్రికొస్తే కొత్తరోగం!

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:03 AM

ఆస్పత్రికి వస్తే ఉన్న రోగం పోవాలి కానీ అనంతపురం పెద్దాస్పత్రికి వస్తే మాత్రం కొత్త రోగాలు తగులుకుంటున్నాయి. ఆస్పత్రిలోని ఆపరేషన థియేటర్లలో పరిశుభ్రత పాటించకపోవడమే కొత్త రోగాల వ్యాప్తికి కారణమని తెలుస్తోంది. ఈ సంఘటనల్లో ఆస్పత్రి పాలనాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గత ఏడాది జూలైలో ఇదే ఆస్పత్రిలో పలువురికి కంటికి శస్త్ర చికిత్సలు చేసి ఇంటికి పంపారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత ఐదుగురు వృద్ధులకు కళ్లు వాపులు రావడం, ఎర్రగా మారడం, మంటలు, ...

Infants being treated in gynecological ward

మొన్న వృద్ధులకు కంటి చూపు పోయింది

ఇప్పుడు బాలింతలకు ఇన్ఫెక్షన సోకింది

సర్వజన ఆస్పత్రిలో నిండా నిర్లక్ష్యం

పరిశుభ్రతా ప్రమాణాలు లేకపోవడం వల్లే..!

అనంతపురం టౌన, జూన 1: ఆస్పత్రికి వస్తే ఉన్న రోగం పోవాలి కానీ అనంతపురం పెద్దాస్పత్రికి వస్తే మాత్రం కొత్త రోగాలు తగులుకుంటున్నాయి. ఆస్పత్రిలోని ఆపరేషన థియేటర్లలో పరిశుభ్రత పాటించకపోవడమే కొత్త రోగాల వ్యాప్తికి కారణమని తెలుస్తోంది. ఈ సంఘటనల్లో ఆస్పత్రి పాలనాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గత ఏడాది జూలైలో ఇదే ఆస్పత్రిలో పలువురికి కంటికి శస్త్ర చికిత్సలు చేసి ఇంటికి పంపారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత ఐదుగురు వృద్ధులకు కళ్లు వాపులు రావడం, ఎర్రగా మారడం, మంటలు, నొప్పులు వచ్చాయి. వారిలో ఒకరిద్దరిని కుటుంబసభ్యులు తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా, మిగిలిన వారిని హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరులోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ వారికి కంటి చూపును తెప్పించలేకపోయారు. ఇందులో అనంతపురంరూరల్‌, ఆత్మకూరు. కనగానపల్లి, కూడేరు మండలాలకు చెందిన వారున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. జిల్లా కలెక్టరు


నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో నలుగురు సీనియర్‌ డాక్టర్లతో కమిటీకూడా వేశారు. ఆపరేషన థియేటర్‌లో నిబంధనల మేరకు పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఇన్ఫెక్షన సోకి ఉంటుందని నిర్ధారించారు. దాదాపు ఐదు నెలలు పాటు ఆ కంటి ఆపరేషన థియేటర్‌ను మూసివేయించారు. అక్కడ శుభ్రత ప్రమాణాలు తనిఖీ చేయిస్తూ, ఇన్ఫెక్షన లేదని తేలిన తర్వాతనే మళ్లీ కంటి ఆపరేషన్లు మొదలు పెట్టారు.

నిండా నిర్లక్ష్యమే..!

ఆస్పత్రికి వచ్చే రోగులను కొందరు డాక్టర్లు సరిగా చూడటంలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరైనా రోగులు చనిపోయిన స్పందర్భంలో కూడా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని బాధితులు ఆందోళన చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. శస్త్ర చికిత్సల విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సిన అధికారులు, డాక్టర్లు, సిబ్బంది వాటిని వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయాలంటే నిబంధనల మేరకు ఆపరేషన థియేటర్లను శుభ్రం చేయించాలి. అక్కడ ఎ లాంటి ఇన్ఫెక్షన లేదని డాక్టర్ల కమిటీ నిర్ధారించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుం ది. కానీ ఇక్కడ డాక్టర్లు అలాం టి ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.


తాజాగా గైనిక్‌ వార్డులో బాలింతలకు...

జిల్లా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన ఘటన పూర్తిగా మరువక ముందే తాజాగా గైనిక్‌ వార్డులలో బాలింతలకు ఇన్ఫెక్షన సోకుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రసవం కష్టమైనపుడు పెద్దాస్పత్రిలో సిజేరియన చేస్తుంటారు. ఆస్పత్రిలో రోజుకు 25నుంచి 30 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇందులో కనీసం ఆరు నుంచి ఎనిమిది మంది వరకు సిజేరియన్స ద్వారా ప్రసవాలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సిజేరియన చేయించుకున్న బాలింతలకు కుట్లు వేసిన ప్రాంతంలో చీము పట్టి గాయాలు అయ్యాయి. ఇవి పెద్ద పుండ్లుగా మారుతున్నాయి. వాటి చికిత్స కోసం కొందరు తిరిగి ఈ ఆస్పత్రికే వస్తున్నారు. గత పదిరోజులుగా ఈవ్యవహారం జరుగుతున్నా బయటకు పొక్కకుండా వైద్యాధికారులు, ఆవిభాగం డాక్టర్లు జాగ్రత్త పడుతూ వస్తున్నట్లు సమాచారం. గైనిక్‌ వార్డులలో పరిశుభ్రత లేక పోవడం వల్లే ఇన్ఫెక్షన ఏర్పడి ఆబాలింతల గాయానికి వేసిన కుట్లు పుండుగా మారాయని డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిసింది.


శుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నాం

గైనిక్‌ వార్డులో సిజేరియన చేయించుకున్న కొంతమంది బాలింతలకు కుట్లు గాయాలు మానడం లేదని, చీము పడుతున్నాయని ఫిర్యాదులొచ్చాయి. కొంతమంది తిరిగి ఆస్పత్రికి రావడంతో వారికి చికిత్స అందిస్తున్నాం. డాక్టర్ల ద్వారా కారణాలు తెలుసుకోగా కొందరికి వారి శరీరతత్వం వల్ల, మరి కొందరికి అపరిశుభ్రత వల్ల కూడా వచ్చి ఉండొచ్చని నివేదించారు. అయితే గైనిక్‌ వార్డులను ప్రత్యేకంగా శుభ్రం చేయిస్తున్నాం. ఇప్పటికే ఒక గదిని పూర్తి శుభ్రం చేయించాం. మిగిలిన వాటిని శుభ్రం చేయిస్తున్నాం.

- డాక్టర్‌ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 02 , 2024 | 12:03 AM

Advertising
Advertising