COLLECTOR : అతిసారతో జాగ్రత్త
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:03 AM
జిల్లాలో అతిసార ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య, పంచాయతీ, జడ్పీ, ఐసీడీఎస్, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖల అదికారులతో శనివారం సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామ, పట్టణ, నగర ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందని అన్నారు. అతిసారపై మరింత అప్రమత్తంగా...
సీజనల్ వ్యాధులను నియంత్రించండి
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం టౌన, జూన 22: జిల్లాలో అతిసార ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య, పంచాయతీ, జడ్పీ, ఐసీడీఎస్, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖల అదికారులతో శనివారం సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామ, పట్టణ, నగర ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందని అన్నారు. అతిసారపై మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ప్రజలకు అవగాహన కల్పించాలని, వారు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని అన్నారు. అతిసార ప్రబలే ప్రమాదం ఉన్న ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అక్కడ తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రులకు వచ్చే కేసుల వివరాలు
తీసుకుని, ఆ ప్రాంతాలకు వెళ్లాలని, బ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, మంచినీటి ట్యాంకులను ఎప్పటికపుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. అంగనవాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పరిశుభ్రతను విధిగా పాటించాలని సూచించారు. నాణ్యమైన భోజనం, తాగునీరు పిల్లలకు అందేలా చూడాలని అన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగేలా అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆగస్టు నెల వరకూ అతిసార, విష జ్వరాల గురించి ప్రజలకు అవగాహన పెంచుతూ, వారు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని, వ్యాధులు ప్రబలకుండా నియంత్రించాలని ఆదేశించారు. సమీక్షలో జడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియా, నగరపాలిక కమిషనర్ మేఘ స్వరూప్, డీపీఓ ప్రభాకరరావు, డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, మున్సిపల్ ఆర్డీ పీవీఎస్‌ఎస్ మూర్తి, డీఐఓ డాక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 23 , 2024 | 12:03 AM