BLOOD DONATION: రక్తదానం.. ప్రాణదానంతో సమానం
ABN, Publish Date - Jun 14 , 2024 | 11:56 PM
రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రధానోపాధ్యాయులు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
బొమ్మనహాళ్, జూన 14: రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రధానోపాధ్యాయులు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రతిఒక్కరికి అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి ఈ రక్తం ప్రాణదానంతో సమానమని తెలిపారు. ఒకరి జీవితాన్ని కాపాడిన వారు అవుతామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరికీ అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వాలని కోరారు. సీహెచఓ నాగమణి, హెల్త్ అసిస్టెంట్లు జైనాబీ, గోవర్ధన, ఉపాధ్యాయుడు నాగభూణం పాల్గొన్నారు.
గుంతకల్లుటౌన: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జేవీవీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్థనరెడ్డి, పోలేరమ్మ ఆలయ కమిటీ ధర్మకర్త దొడ్డప్ప కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపుడుతున్న రక్తదాతల సేవలు మరవలేనివన్నారు. అనంతరం పలువురు రక్తదానం చేశారు. జేవీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్‌యాదవ్, ప్రభుత్వ ఆసుపత్రి ఏఓ రాంప్రసాద్‌రావు, ల్యాబ్ టెక్నీషియన్లు సత్య, రాజు పాల్గొన్నారు.
Updated Date - Jun 14 , 2024 | 11:56 PM