ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Corporation : ఇద్దరూ ఇద్దరే..!

ABN, Publish Date - Jun 21 , 2024 | 12:22 AM

అనంత నగరపాలిక ఇంజనీరింగ్‌ విభాగంలో ఇద్దరు మహిళా అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. విధి నిర్వహణలో వారి తీరు ఉన్నతాధికారులకు తలనొప్పి తెప్పిస్తోందట. బుద్ధిగా వేతనం తీసుకుని.. వచ్చిన ఫైళ్లను పరిశీలించి పై అధికారులకు ఫార్వర్డ్‌ చేయడం కూడా వారికి చేతకాదని అంటున్నారు. అయినా.. కమీషనలు మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. పనుల విషయంలో అంచనాలను తక్కువ ధరకు కోట్‌ చేసి పంపుతారని విమర్శలు వస్తున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పొసగదని, ఏ పని ...

Ananthapur Municipal Corporation

నగరపాలికలో కమీషన్ల పర్వం

పనులు చేయరు.. పద్ధతి మార్చుకోరు

ఫైల్స్‌ కదలాలంటే చేయి తడపాల్సిందే

కమిషనర్‌ చేతికి వారి ‘అవినీతి’ నివేదిక

సరెండర్‌కు ఆదేశం.. ఎన్నికల కోడ్‌తో బ్రేక్‌

అనంతపురం క్రైం, జూన 20: అనంత నగరపాలిక ఇంజనీరింగ్‌ విభాగంలో ఇద్దరు మహిళా అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. విధి నిర్వహణలో వారి తీరు ఉన్నతాధికారులకు తలనొప్పి తెప్పిస్తోందట. బుద్ధిగా వేతనం తీసుకుని.. వచ్చిన ఫైళ్లను పరిశీలించి పై అధికారులకు ఫార్వర్డ్‌ చేయడం కూడా వారికి చేతకాదని అంటున్నారు. అయినా.. కమీషనలు మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. పనుల విషయంలో అంచనాలను తక్కువ ధరకు కోట్‌ చేసి పంపుతారని విమర్శలు వస్తున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పొసగదని, ఏ పని అప్పగించినా తాము చూడలేదు.. చేయలేదు అంటూ నేరుగా ఫైల్‌లో నోట్‌ చేస్తారని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వీరి తీరు కారణంగా కాంట్రాక్టర్లకు


ఈఈ సమాధానం చెప్పుకోలేక.. ఇనచార్జ్‌ ఎస్‌ఈకి నోట్‌ రూపంలో ఫిర్యాదు చేశారు. ఆ నోట్‌ ఆధారంగా ఇనచార్జ్‌ ఎస్‌ఈ లోతుగా విచారించారు. గతంలో వారు చేసిన అవినీతి వ్యవహారాలను జోడించి.. కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను చూసిన కమిషనర్‌.. ‘ఇలాంటి వాళ్లు మనకెందుకు..?’ అంటూ సరెండర్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కానీ అదే సమయంలోనే ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ప్రభుత్వం మారడంతో ఇక మునుముందు ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది.

జీతం చాల్లేదేమో..

ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే వేల రూపాయల వేతనం వారికి సరిపోవడం లేదు. అవినీతికి తెరలేపారు. నగరపాలికలో డీఈ, ఏఈ ఉద్యోగాలను వెలగబెడుతూ.. ఒక శాతం, రెండు శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని సమాచారం. ‘కమీషన ఇవ్వం.. మళ్లీ ఇస్తాం’ అని ఎవరైనా అంటే కుదరదట. ఫైల్‌పై సంతకం పెట్టాలంటే ముందు కమీషన చేతికందాల్సిందే అని అంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే ప్రతి ఫైల్‌కూ ఆ ఇద్దరూ కమీషన ముక్కుపిండి వసూలు చేస్తున్నారని సమాచారం. కమీషన ఇచ్చినా.. ఫైల్స్‌పై త్వరగా సంతకాలు చేయరట. వారికి ఇష్టం వచ్చినప్పుడే సంతకాలు చేసి పై అధికారులకు పంపుతారని సమాచారం. కమీషన్ల విషయంలో పోటీపడే వీరు.. కలిసిమెలిసి పని చేస్తారా అంటే.. అదీ లేదు. ఎడ్డెమంటే తెడ్డెం అంటారని బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు.


అన్నీ ఆటంకాలే..

ఆ ఇద్దరు ఇంజనీర్ల కారణంగా నగరపాలికలో పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఇంజనీరింగ్‌ సిబ్బంది వాపోతున్నారు. ఏదైనా వర్క్‌ ఫైల్‌ వెళితే సరిగా స్పందించరట. ఆ ఫైల్‌, ఆ వర్క్‌ తమకు సంబంధం లేదు అంటారట. చూడలేదు, చేయలేదు అని నోట్‌ రాస్తారట. దీంతో ఆ ఫైల్‌ తిరిగి కిందికి వస్తోందని ఈఈ దృష్టికి తీసుకెళ్తున్నారు. కొన్ని సార్లు చెప్పి చూశారు. కానీ వారిలో మార్పు రాలేదు. మూడు నెలల క్రితం ఆరు కంప్యూటర్లు కావాలని టెండరు పిలిచారట. కానీ మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరకు కోట్‌ చేశారట. కనీసం రూ.30 వేలు విలువ చేసే కంప్యూటర్లకు రూ.23 వేలు, రూ.25 వేలు ఎస్టిమేషన వేసినట్లు సమాచారం. దీంతో పలుమార్లు టెండర్‌ పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టరూ ముందుకు రాలేదని సమాచారం. ప్రతి టెండరు విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. మహనీయుల జయంతి, వర్ధంతి సందర్భాల్లో విగ్రహాలకు వినియోగించే పూల మాలలు, అలంకరణకు రూ.30 వేల నుంచి రూ.35 వేల ఖర్చు కావచ్చని చెబితే.. రూ.2 వేల నుంచి బేరం మొదలు పెట్టి రూ.5 వేలకు పూర్తి చేయొచ్చుగా అంటారట. దీంతో కాంట్రాక్టర్లు టెండరు వద్దే వద్దని పారిపోతున్నారని సమాచారం.

బదిలీనా...? సరెండరా...?

ఇంజనీరింగ్‌ పనులు, టెండర్ల విషయంలో ఆ ఇద్దరి తీరుతో విసిగిపోయిన ఈఈ. కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పలేక.. ఇనచార్జ్‌ ఎస్‌ఈ రామ్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన ఎస్‌ఈ.. కర్నూలు జిల్లా డోన మున్సిపాలిటీలో, అహుడాలో జరిగిన అవినీతి వ్యవహారాలను జోడించి.. నోట్‌ సిద్ధం చేరు. నివేదికను కమిషనర్‌ మేఘ స్వరూ్‌పకు పంపారు. ఆ వివరాలు చూసిన కమిషనర్‌.. సరెండర్‌కు ఆదేశాలిచ్చారని తెలిసింది. అదే సమయంలోనే ఎన్నికల కోడ్‌ రావడంతో వారి సరెండర్‌కు బ్రేక్‌ పడింది. ఎన్నికలు ముగిశాయి..! ఇకపై ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 21 , 2024 | 12:22 AM

Advertising
Advertising