MS : వైసీపీ ఫ్యాన రెక్కలను ఓటుతో విరగ్గొట్టండి
ABN, Publish Date - May 10 , 2024 | 12:49 AM
రాష్ట్రంలో ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన రెక్కలను ఓటుతో విరగ్గొట్టాలని సినీనటుడు నారారోహిత పేర్కొన్నారు. ఆయన గురువారం గుడిబండలో రోడ్‌షో నిర్వహించా రు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్య దర్శి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారారోహిత మాట్లాడుతూ నారాచంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ది చెందుతుందని అన్నారు.
నారా రోహిత పిలుపు
ఎంఎస్ రాజుకు మద్దతుగా ప్రచారం
గుడిబండ, మే 9: రాష్ట్రంలో ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన రెక్కలను ఓటుతో విరగ్గొట్టాలని సినీనటుడు నారారోహిత పేర్కొన్నారు. ఆయన గురువారం గుడిబండలో రోడ్‌షో నిర్వహించా రు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్య దర్శి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారారోహిత మాట్లాడుతూ నారాచంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ది చెందుతుందని అన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి అనంతపురం జిల్లాలో దేశంలో ఎక్కడాలేనివిధంగా కియా పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాం త ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. వైసీ పీ ప్రభుత్వం ఒక్క ఛాన్సతో అధికారంలోకి వచ్చి రాష్ట్రా న్ని నాశనం చేసిందని 50ఏళ్లు వెనకబడిపోయిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంఎస్ రాజు, పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతంలో అరాచక పాలన సాగించారని, టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సమ స్యలను పరిష్కరించడంతోపాటు మడకశిర నియోజక వర్గం అభివృద్ధి పనులు చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, దుర్గేష్, మంజునాథ్, నాగేపల్లిసురేష్, షబ్బీర్, లక్ష్మీనరసప్ప, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రొళ్ల: ఎంఎస్ రాజుకు మద్దతుగా సినీనటుడు నారా రోహిత గురువారం రొళ్లలో రోడ్‌షో నిర్వహించి మాట్లాడారు. టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌రాజు, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ కృష్ణా జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతం చెరువులకు హంద్రీ నీవాద్వారా నీటితో నింపి సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతరం ఎంఎస్ రాజు మాట్లాడుతూ వెనుకబడిన మడకశిర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రత్యేక నిధులు తెచ్చి ఈ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తా మన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస మూర్తి, నాయకులు పాండురంగప్ప, గురుమూర్తి, దాసిరెడ్డి, సిద్దగంగప్ప, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అగళి: టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు భార్య ఉమాదేవి పేర్కొ న్నారు. ఆమె గురువారం మండలంలోని హళ్లికెర, పూలపల్లి, కోడిపల్లి, మధూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. జడ్పీటీసీ ఉమేష్, బీసీసెల్ తాలూకా అధ్యక్షుడు తిప్పేస్వామి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన తిప్పేస్వామి, బోయనాగరాజు, మండల క్లస్టర్ ఇంచార్జ్ శివకుమార్, కన్వీనర్ కుమారస్వామి, మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 10 , 2024 | 12:49 AM