GUNDUMALA : కల్వర్టు నిర్మించండయ్యా..!
ABN, Publish Date - Jun 22 , 2024 | 11:54 PM
వర్షాలకు కోతకు గురైన మండలంలోని పళారం పెద్దవంక క ల్వర్టును పునర్ ని ర్మించాలని స్థానికులు మాజీ ఎమ్మెల్సీ గుం డుమల తిప్పేస్వామి ని కోరారు. గుండు మల శనివారం ఆ మార్గంలో వెళుతున్న ఆయనకు గ్రామస్థులు విన్నవించారు. ఇటీవల కురిసిన వర్షానికి వంకు ఉధృతంగా ప్రవహించడంతో కల్వర్టు దెబ్బ తిందని తెలిపారు.
గుడిబండ, జూన 22 : వర్షాలకు కోతకు గురైన మండలంలోని పళారం పెద్దవంక క ల్వర్టును పునర్ ని ర్మించాలని స్థానికులు మాజీ ఎమ్మెల్సీ గుం డుమల తిప్పేస్వామి ని కోరారు. గుండు మల శనివారం ఆ మార్గంలో వెళుతున్న ఆయనకు గ్రామస్థులు విన్నవించారు. ఇటీవల కురిసిన వర్షానికి వంకు ఉధృతంగా ప్రవహించడంతో కల్వర్టు దెబ్బ తిందని తెలిపారు. దీంతో ఈ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు పడాల్సి వస్తోందని ప్రజలు మాజీ ఎమ్మెల్సీకి వివరించారు.
కల్వర్టు నిర్మా ణానికి చర్యలు తీసుకుంటామని గుండుమల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దనకుంటప్ప, మంజునాథ్, షబ్బీర్, లక్ష్మీనరసప్ప, దుర్గేష్, శివకుమార్, తదితరులు ఉన్నారు.
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
గుడిబండ మండలపరిధిలోని బైరేపల్లి, అమరాపురం మండలం ఆలదపల్లి ఆంజనేయ స్వామి ఆలయాల్లో శనివారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రత్యేక పూజలు చేయించారు. టీడీపీ నాయకు లతో కలిసి ఆయన స్వామికి అభిషేకం, ఆకుపూజ, తదితర పూజా కార్యక్రమా లను నిర్వహించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మండల కేంద్రమైన గుడిబండలో శనివారం వర్షా సైనిక్ స్కూల్‌ను ప్రారంభించారు. ఆ యన ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మద్దన కుంటప్ప, లింగాయత జిల్లా అధ్య క్షుడు దుర్గేష్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, క్లస్టర్ ఇనచార్జ్‌లు లక్ష్మీనర సప్ప, భీమరాజు, నాయకులు షబ్బీర్, గోవిందప్ప, శివకుమార్, ప్రకాశ, అమరా పురం మండల కన్వీనర్ గణేష్, నాయకులు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 22 , 2024 | 11:54 PM