ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉంతకల్లులో మెజార్టీ తెచ్చుకోగలవా?

ABN, Publish Date - Mar 12 , 2024 | 11:51 PM

వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సొంత గ్రామమైన ఉంతకల్లులో మెజార్టీ తెచ్చుకోగలవా అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సవాల్‌ విసిరారు.

సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

మెట్టు గోవిందరెడ్డికి కాలవ సవాల్‌

బొమ్మనహాళ్‌, మార్చి 12: వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సొంత గ్రామమైన ఉంతకల్లులో మెజార్టీ తెచ్చుకోగలవా అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సవాల్‌ విసిరారు. మండలంలోని ఎల్‌బీనగర్‌లో మంగళవారం శంఖారావం సభను నిర్వహించారు. సభకు కాలవ శ్రీనివాసులుతో పాటు జనసేన ఇనచార్జి మంజునాథగౌడ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ బలరాంరెడ్డి పాల్గొన్నారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ఎన్నికలు సమర్థునికి, అసమర్థునికి, పనిచేసేవారికి, పనికిమాలిన వానికి జరిగే యుద్ధమన్నారు. ఉంతకల్లు గ్రామంలోనే మెట్టు గోవిందరెడ్డి మెజార్టీ తెచ్చుకోలేడని వ్యాఖ్యానించారు. ఆ గ్రామం నుంచి మెట్టును ఉరికిస్తారన్నారు. వట్టి మాటలు తప్ప ఎందుకు పనికిరాని మెట్టుకు ఎమ్మెల్యే పదవి అవసరమా.. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఏపీఐఐసీ చైర్మనగా పదవులు అనుభవించిన ఆయన సొంత గ్రామంలో పదిమందికైనా ఉపాధి కల్పించాడా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల శక్తి ముందు వైసీపీ ముఖ్యమంత్రి జగనరెడ్డి తట్టుకోలేరనిఅన్నారు. తొమ్మిదిసార్లు కరెంటు బిల్లు, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని విమర్శించారు. బాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ మండల కన్వీనర్లు బలరాంరెడ్డి, హనుమంతరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మెన చంద్రహాస్‌, కేశవరెడ్డి, వాణిజగన్నాథ్‌రెడ్డి, కొత్తపల్లి మల్లికార్జున, ఎర్రగుంట్ల వెంకటేశులు, ముల్లంగి నారాయణస్వామి, కొత్తపల్లి తిమ్మరాజు, మాలపాటి ధనుంజయ, పయ్యావుల మోహన, పయ్యావుల అనిల్‌, పయ్యావుల నాగరాజు, మాజీ డైరెక్టర్‌ మహేంద్ర, ఉప్పరహాళ్‌ స్వామి, వన్నారెడ్డి, మల్లీడు శీన, మాజీ కన్వీనర్‌ చలపతి, జనసేన కన్వీనర్‌ శివరాజ్‌, బీజేపీ నాయకులు ఎర్రిస్వామి, మాజీ ఎంపీపీ షణ్ముఖయ్య, కావలి రాము, ముల్లంగి భాస్కర్‌, ప్రభు, నవీన, కేశప్ప, సంగప్ప పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:51 PM

Advertising
Advertising