JAGANNATH RATHAYATRA : అడుగడుగో.. జగన్నాథుడు!

ABN, Publish Date - Jul 14 , 2024 | 12:29 AM

జగన్నాథ రథయాత్ర నగరవాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఇస్కాన అనంతపురం శాఖ ఆధ్వర్యంలో శనివారం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని రథంపై కొలువుదీర్చి నగర వీధులలో ఊరేగించారు. రథయాత్ర సాగే దారులను మహిళలు, యువతులు రంగవళ్లికలతో అలంకరించారు. వివిధ రాషా్ట్రల నుంచి వచ్చిన కళాకారులు రథం ముందు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తులు హరినామస్మరణ చేస్తూ, నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు. రథోత్సవం ప్రారంభానికి ముందు కేఎ్‌సఆర్‌ కళాశాల వద్ద ఇస్కాన జాతీయ ప్రతినిధులు ...

JAGANNATH RATHAYATRA : అడుగడుగో.. జగన్నాథుడు!
Balabhadra and Subhadra together with Jagannatha Swamy appearing to devotees

బలభద్ర, సుభద్ర సమేతుడై వచ్చాడు

అనంత వీధులలో స్వామివారి రథయాత్ర

జగన్నాథ రథయాత్ర నగరవాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఇస్కాన అనంతపురం శాఖ ఆధ్వర్యంలో శనివారం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని రథంపై కొలువుదీర్చి నగర వీధులలో ఊరేగించారు. రథయాత్ర సాగే దారులను మహిళలు, యువతులు రంగవళ్లికలతో అలంకరించారు. వివిధ రాషా్ట్రల నుంచి వచ్చిన కళాకారులు రథం ముందు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తులు హరినామస్మరణ చేస్తూ, నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు. రథోత్సవం ప్రారంభానికి ముందు కేఎ్‌సఆర్‌ కళాశాల వద్ద ఇస్కాన జాతీయ ప్రతినిధులు సత్యగోపీనాథ్‌దాస్‌, రాధామనోహర్‌దాస్‌ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. భగవంతునికి, భక్తునికి మధ్య బంధానికి ప్రతీకలు ఇలాంటి రథయాత్రలు అని అన్నారు. మన


దేశంతోపాటు పాశ్చాత్య దేశాల్లోని నాలుగు వేల ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్నాథుడి రథయాత్రతో నగరం మరింత పవిత్రతను సంతరించుకుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. దైవ దర్శనానికి ఆలయాలకు వెళ్లడం పరిపాటి అని, కానీ జగన్నాథుడే భక్తుల చెంతకు వచ్చి అనుగ్రహించడం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యమని మాజీ మంత్రి శైలజానాథ్‌ అన్నారు. పూణె నుంచి వచ్చిన కళాకారుల బృందానికి మాసినేని రామయ్య రూ.3.5 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ముఖ్య అతిథులు బంగారు వర్ణపు చీపుర్లతో రోడ్లను ఊడ్చగా... వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివార్లకు పూజలు నిర్వహించి.. రథయాత్రను ప్రారంభించారు. కేఎ్‌సఆర్‌ కళాశాల వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర.. సప్తగిరి సర్కిల్‌, క్లాక్‌ టవర్‌, రాజురోడ్డు, శ్రీకంఠం సర్కిల్‌, తిలక్‌రోడ్డు, గాంధీబజార్‌, పాతూరు, బసవన్నకట్ట, సప్తగిరి సర్కిల్‌ మీదుగా లలితకళాపరిషత వరకూ సాగింది. జెడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, మాజీ మేయర్‌ మదమంచి స్వరూప, ఇస్కాన్‌ మందిర చైర్మన దామోదర్‌ గౌరంగదాస్‌, శ్రీపాద వేణు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ రంగారెడ్డి తదితరులు రథయాత్రలో పాల్గొన్నారు.

- అనంతపురం కల్చరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 14 , 2024 | 12:29 AM

Advertising
Advertising
<