ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YOGA DAY: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN, Publish Date - Jun 21 , 2024 | 11:54 PM

యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని జిల్లా అదనపు న్యాయాధికారి కంపల్లె శైలజా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని పరుపుకున్నారు.

Magistrates and lawyers sitting in Hindupuram

హిందూపురం, జూన 21: యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని జిల్లా అదనపు న్యాయాధికారి కంపల్లె శైలజా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని పరుపుకున్నారు. స్ధానిక కోర్టు ఆవరణలో న్యాయవాదులు యోగా ఆసనాలు వేశారు. ఏడీజే మాట్లాడుతూ ప్రతి మనిషి ప్రస్తుత తరుణంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారని, యోగాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత వుంటుందన్నారు. సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రీదర్‌, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే విప్రోకేర్‌ సహకారంతో వాసవీ మహిళా మండలి, కుషాల్‌ హెల్త్‌ కేర్‌ ఆధ్వర్యంలో పులమతి, కొటిపి, తూమకుంట, చౌళూరు కర్ణాటక సరిహద్దులోని గ్రామాల్లో పాఠశాల విద్యార్థులతో యోగాపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రాధమ్మ, లక్ష్మమ్మ, క్రిష్ణవేణి పాల్గొన్నారు.

మడకశిరటౌన: ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక సాధనమని ప్రతి ఒక్కరు యోగాను అలవాటు చేసుకోవాలని న్యాయవాది రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడకశిర పట్టణంలోని పాఠశాలల్లో విద్యార్థులకు యోగా వల్ల కలిగే లాభాలను వివరించారు.

రొళ్ల: మండలంలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, వివిధ పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. శుక్రవారం అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో యోగా చేయించారు. ఎంఈఓ శ్రీదర్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మైలారప్ప, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


పెనుకొండ టౌన: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెనుకొండ కోర్టు ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ, సీ నియర్‌ సివిల్‌ నాయాఆధికారి వాసుదేవన, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం. బుజ్జప్ప, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ముజీబ్‌ పసపల సయ్యద్‌ ఆధ్వర్యంలో యోగా గురువు వెంకటేశ్వర్లు సమక్షంలో యోగా శిక్షణ ఇచ్చారు. న్యాయవాదులు భాస్కర్‌రెడ్డి, నాగేశ్వరి పాల్గొన్నారు.

మడకశిర రూరల్‌: ఒత్తిడిని, వ్యాధులను దూరం చేయడానికి యోగా సంజీవినిలా పని చేస్తుందని యోగా గురువు నాగభూషణం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం మండలంలోని కళాశాల్లో, పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఉద్యాన పాలటిక్నిక్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణ, పీడీ రాజేశ కుమార్‌ విద్యార్థులు పాల్గొన్నారు.


పావగడ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని పాఠశాలలు, యోగా మందిరాల్లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉద యం 5గంటలకే యోగా మందిరంలో యోగా గురువులు యోగాతో కలిగే ప్రయోజనాలను యోగా గురువు అంతరగంగ శంకరప్ప వివరించారు.

గోరంట్ల: మండల వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గోరంట్లలోని బాలుర ఉన్నతపాఠశాల, వానవోలు, మందలపల్లి, కొండాపురం సెక్టారు పరిధిలోని అంగనవాడీ కేంద్రాల్లో యోగా దినోత్సవం జరిపారు. సూపర్‌వైజర్‌ నాగరాణి ఆ ఽధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు తల్లులు, పిల్లలకు యోగాపై అవగాహన కల్పించారు. సిద్ధసమాధి యోగా ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి, మాధవరాయ ఆలయంలో సురేష్‌ గురూజీ ఆధ్వర్యం లో ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ఆసనాలు వేయించారు. ముఖ్య అతిథిగా హిందూపురం నుంచి శివగురుప్రసాద్‌ గూరుజీ హాజరయ్యారు.

పెనుకొండ: యోగాతో శారీరక వికాసం, మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రిన్సిపాల్‌ కేశవరావు అన్నారు. శుక్రవారం స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎనఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆసనాలు వేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.జయప్ప, కోఆర్డినేటర్లు యశోదరాణి, శ్రీదేవి, పీఓలు కాంతారావు, రంగనాయకులు, అధ్యాపకులు ప్రతాప్‌, నారాయణ, రామన్న పాల్గొన్నారు. అలాగే బ్రిలియన్స పాఠశాలలో కరస్పాండెంట్‌ నాగవేణి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - Jun 21 , 2024 | 11:54 PM

Advertising
Advertising