CHITS : అప్పులు ఎక్కువై.. దిక్కుతోచక..!
ABN, Publish Date - Jul 12 , 2024 | 12:10 AM
చిట్టీలు వేసిన ఓ విశ్రాంత ఉద్యోగి.. అప్పులు ఎక్కువై పారిపోయాడు. సుమారు రూ.కోటి వరకూ మోసపోయామని పలువురు మహిళలు గుత్తి పోలీస్ స్టేషనలో గురువారం ఫిర్యాదు చేశారు. గుత్తి ఆర్‌ఎ్‌సలోని బండిమోటు వీధిలో ఉంటున్న అత్తర్ హుస్సేన.. రైల్వేలో పనిచేస్తూ ఐదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. సుమారు పదిహేనేళ్ల నుంచి చిట్టీలు నడుపుతున్నాడు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల చిట్టీలు నడిపేవాడని, గతంలో క్రమం తప్పకుండా సొమ్ము చెల్లించేవాడని బాధితులు తెలిపారు. ఇటీవల అప్పుల్లో కూరుకుయాడని ...
పారిపోయిన చిట్టీల వ్యాపారి..
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
గుత్తి, జూలై 11: చిట్టీలు వేసిన ఓ విశ్రాంత ఉద్యోగి.. అప్పులు ఎక్కువై పారిపోయాడు. సుమారు రూ.కోటి వరకూ మోసపోయామని పలువురు మహిళలు గుత్తి పోలీస్ స్టేషనలో గురువారం ఫిర్యాదు చేశారు. గుత్తి ఆర్‌ఎ్‌సలోని బండిమోటు వీధిలో ఉంటున్న అత్తర్ హుస్సేన.. రైల్వేలో పనిచేస్తూ ఐదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. సుమారు పదిహేనేళ్ల నుంచి చిట్టీలు నడుపుతున్నాడు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల చిట్టీలు నడిపేవాడని, గతంలో క్రమం తప్పకుండా సొమ్ము చెల్లించేవాడని బాధితులు తెలిపారు. ఇటీవల అప్పుల్లో కూరుకుయాడని
సమాచారం. ఈ నేపథ్యంలో గత నెలలో బక్రీద్ పండుగ ముగిశాక తరువాత అత్తర్ హుస్సేన, ఆయన భార్య ఎటో వెళ్లిపోయారు. అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిసిందని బాధితులు వాపోయారు. సొంత ఇల్లే అయినా.. బ్యాంకులో తాకట్టు పెట్టాడని, బయటి సంస్థలలో పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాడని తెలిపారు. రుణాలను తిరిగి చెల్లించలేకపోయాడని, ఈ కారణంగా తమకు చిట్టీల డబ్బులు కూడా ఆలస్యంగానే ఇచ్చేవాడని అన్నారు. ఉన్నట్టుండి పారిపోవడంతో తమకు దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీనాలీ చేసుకుని చిట్టీలు వేశామని, సుమారు 40 మందికి డబ్బులు రావాల్సి ఉందని అన్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 12 , 2024 | 12:10 AM