PINCHAN : పింఛన కోసం పాట్లు
ABN, Publish Date - May 04 , 2024 | 12:22 AM
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన మొత్తాలను ఎన్నికల నేపథ్యంలో అధికారులు వారివారి బ్యాంక్ ఖాతాలకు జమచే వారు. దీంతో పింఛన సొమ్ము కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం ఇప్పుడు రద్దీ ఉందని సాకులు చెబుతూ రేపు, ఎల్లుండి వచ్చి తీసుకోండంటూ వెనక్కు పంపుతున్నారని వృద్ధులు వాపోతున్నారు.
బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు
గుడిబండ, మే 3: వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన మొత్తాలను ఎన్నికల నేపథ్యంలో అధికారులు వారివారి బ్యాంక్ ఖాతాలకు జమచే వారు. దీంతో పింఛన సొమ్ము కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం ఇప్పుడు రద్దీ ఉందని సాకులు చెబుతూ రేపు, ఎల్లుండి వచ్చి తీసుకోండంటూ వెనక్కు పంపుతున్నారని వృద్ధులు వాపోతున్నారు.
మండలంలోని మందల పల్లి, గుడిబండ కెనరాబ్యాంక్ బ్రాంచలు, రాళ్లపల్లి, మోరుబాగల్‌లో యూనియన బ్యాంక్ బ్రాంచలు ఉన్నాయి. పింఛన మొత్తాలు ఈ బ్యాంకుల్లోని లబ్ధిదారుల ఖాతాలకు జమ అయ్యాయి. బ్యాంకుల నుంచి పింఛన సొమ్ము తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నా మని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇదిలాఉంటే కొంతమంది పింఛన సొమ్మును బ్యాంకర్లు పాత అప్పులకు జమచేసుకుంటున్నారని, ఇలా అయితే తమ నెలవారీ అవసరాలు ఎలా తీర్చుకునేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వాపోతున్నారు. బ్యాంకుల్లో తగినంత సిబ్బంది ఉన్నా పింఛన మొత్తాలను లబ్దిదారులకు అందించలేకపోతున్నారని వాపోతున్నారు. అధికారులు వెంటనే చొరవ తీసుకుని లబ్ధిదారులకు ఈ నెల పింఛన సొమ్ము అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 04 , 2024 | 12:22 AM