ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

DMHO : కాకి గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచఓ

ABN, Publish Date - May 25 , 2024 | 12:10 AM

మండల పరిధిలోని కాకి గ్రామంలో మూడు రోజులుగా డా క్టర్‌ సౌందర్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని డీఎంహెచఓ మంజు వాణి శుక్రవారం సందర్శించారు. గ్రామంలో పలువురు వాంతులు విరేచనాలతో బాధపడుతున్న విషయం విదితమే. మూడు రోజులుగా గ్రామంలో వైద్యశిబిరా న్ని నిర్వహిస్తున్నారు. డీఎంహెచఓ శిబిరాన్ని పరిశీలించి వైద్యురాలితో విష యంపై ఆరాతీశారు.

DMHO Manjuvani talking to the medical officer

రొళ్ల, మే 24 : మండల పరిధిలోని కాకి గ్రామంలో మూడు రోజులుగా డా క్టర్‌ సౌందర్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని డీఎంహెచఓ మంజు వాణి శుక్రవారం సందర్శించారు. గ్రామంలో పలువురు వాంతులు విరేచనాలతో బాధపడుతున్న విషయం విదితమే. మూడు రోజులుగా గ్రామంలో వైద్యశిబిరా న్ని నిర్వహిస్తున్నారు. డీఎంహెచఓ శిబిరాన్ని పరిశీలించి వైద్యురాలితో విష యంపై ఆరాతీశారు. వ్యాధులు ప్రబలకుండా... వాంతులు, విరేచనాల బాధితులు పెరుగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అదేవిధంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై పంచా యతీ అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. పంచాయతీ బోరు నుంచి వచ్చే నీరు కాకుండా శుద్ధిచేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా కొన్ని రోజులు సరఫరా చేయాలని ఎంపీడీఓ, ఈఓఆర్డీ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.


సీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్త

అగళి: సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎం హెచఓ మంజువాణి వైద్యఆరోగ్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందే వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్న నేపథ్యం లో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. అదేవిధంగా వర్షాలు పడి నీరు ఎక్కడబడితే అక్కడ కలుషితంగా మారి వాటివల్ల ప్రజలు రోగాలబారిన పడే అవకాశం ఉందన్నారు. అనంతరం సిబ్బందితో ఆరోగ్య విషయాలపై చర్చిం చారు. మంజువాణికి డీఎంహెచఓగా ఉద్యోగోన్నతి రావడంతో సిబ్బంది శాలువ కప్పి పూలమా లలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ శివానంద, గాయత్రి పీహెచఎన లక్ష్మీదేవి, సుధాకర్‌, రాజు, భూషణ్‌నాయక్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ఏఎనఎం తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 25 , 2024 | 12:10 AM

Advertising
Advertising