COUNCIL MEET: తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
ABN, Publish Date - Jun 30 , 2024 | 12:15 AM
పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్ధానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశానికి చైర్ పర్సన వన్నూర్‌బీ అధ్యక్షత వహించారు.
గుత్తి, జూన 29: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్ధానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశానికి చైర్ పర్సన వన్నూర్‌బీ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎమ్మెల్యేకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో గత వైసీపీ ప్రభుత్వం, పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. మున్సిపాలిటీలో కూడా అధికారులు, సిబ్బంది పని తీరు బాగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు నారాయణ సహకారంతో మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో 30శాతం తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. గుత్తి చెరువుకు హంద్రీనీవా జలాలతో నింపుతామన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. నాలుగు రోజుల నుంచి ఆసుపత్రి పరిసరాలలో ఉన్న అపరిశుభ్రతను, మట్టిదిబ్బలు, పిచ్చిమొక్కులను తొలగించారు. టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ, నారాయణస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప, నాయకులు ఎంకే చౌదరి, నారాయణస్వామి, రవి, ప్రతాప్ పాల్గొన్నారు.
టీడీపీలోకి చేరిన వైస్ ఎంపీపీ
పామిడి: వైస్ ఎంపీపీ కాయల మహేష్ వైసీపీని వీడి గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. శనివారం మహే్‌షకు కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన వీరాంజనేయులు సోదరుడు మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు తన కుమారులతో పాటు అనుచరులతో టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే జయరాంను పార్టీలోకి చేరుతున్న నాయకులు గజమాలతో సత్కరించారు.
కష్టపడిన కార్యకర్తలకు సముచితస్థానం: ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు సముచితస్థానం ఉంటుందని జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్షించారు. ఎన్నికల సంగ్రామంలో వైసీపీ నాయకుల ఒత్తిళ్లుకు తలొగ్గకుండా టీడీపీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా శ్రమించారన్నారు. అలాంటి కార్యకర్తలకు ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందన్నారు.
Updated Date - Jun 30 , 2024 | 12:16 AM