ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అనంత కరువు రైతు కష్టాలు పట్టవా..?

ABN, Publish Date - Feb 26 , 2024 | 11:54 PM

కరువు జిల్లా అనంత రైతులను వదిలేసి కుప్పంకు కృష్ణాజలాలు ఏ విధంగా తరలిస్తారని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య ప్రశ్నించారు.

మీడియాతో మాట్లాడుతున్న ఆవుల కృష్ణయ్య

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 26 : కరువు జిల్లా అనంత రైతులను వదిలేసి కుప్పంకు కృష్ణాజలాలు ఏ విధంగా తరలిస్తారని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య ప్రశ్నించారు. సోమవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో నీరులేక పంటలు ఎండిపోతున్నా జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరుమెదపకపోవడం శోచనీయమన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో కరువు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ సారి ఆయకట్టుకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారన్నారు. అనేక మంది రైతులు తమ పొలాలను బీడుగా పెట్టుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. 2023-24 సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లల్లో వర్షాభావంతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించకుండా జాప్యం చేయడం దారుణమన్నారు. ఇప్పటికై నా కరువు జిల్లా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓబుళపతి, పెద్దన్న, నారాయణస్వామి, బ్యాళ్ల రాము పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:55 PM

Advertising
Advertising