BALAKRISHNA : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: బాలకృష్ణ
ABN, Publish Date - Apr 24 , 2024 | 11:54 PM
మారుతున్న కాలానుగుణంగా భవిష్యత్తు తరాలకు మనం వనాలు తెచ్చి ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం మండలపరిధిలోని సడ్లపల్లివద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాను రాను వనాలు తగ్గిపోతున్నాయని, అడవులు కరిగిపోతున్నాయన్నారు. వర్షాలు రాక ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాగే అయితే భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాలవద్ద విరివిగా చెట్లు పెంచాలన్నారు.
హిందూపురం, ఏప్రిల్ 24 : మారుతున్న కాలానుగుణంగా భవిష్యత్తు తరాలకు మనం వనాలు తెచ్చి ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం మండలపరిధిలోని సడ్లపల్లివద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాను రాను వనాలు తగ్గిపోతున్నాయని, అడవులు కరిగిపోతున్నాయన్నారు. వర్షాలు రాక ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాగే అయితే భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాలవద్ద విరివిగా చెట్లు పెంచాలన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, పట్టణాధ్యక్షుడు రమేష్, నాయకు లు చంద్రమోహన, హెచఎన రాము, బేవనహళ్లి ఆనంద్, లింగారెడ్డి, ఆదినారాయణ, వెంకటనారాయణ, రామప్ప, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుల కుటుంబాలకు పరామర్శ
హిందూపురం/ లేపాక్షి : కొంతకాలం కిందట మృతిచెందిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నందమూరి బాల కృష్ణ పరామర్శించారు. నారాయణరెడ్డి ఇంట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ హయాం నుంచి మృతిచెందేవరకు పార్టీ వెంటే ఉన్నాడని ఆయన లేనిలోటు పార్టీకి తీరనిదన్నారు. మీ కుటుంబానికి భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే లేపాక్షి మండలంలోని మాజీ జడ్పీటీసీ నా యనపల్లి ఆదినారాయణరెడ్డి కుటుంబాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాల కృష్ణ బుధవారం పరామర్శించారు. నాయనపల్లిలోని ఆదినారాయణరెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆదినారాయణరెడ్డికి కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు.
బాలకృష్ణకు మద్దతుగా భారీగా ఎన్నికల ప్రచారం
చిలమత్తూరు: టీడీపీ కూటమి హిందూపురం నియోజకవర్గ ఎమ్మె ల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు మద్దతుగా భారీ జనసందోహం మధ్యన బుధవా రం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం జరిగింది. జడ్పీటీసీ అనూష, టీడీపీ నా యకులు నాగరాజుయాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన జనంతో ఇంటింట ఎన్నికల ప్రచారం సాగింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 24 , 2024 | 11:54 PM