ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TEMPLE: ధూపదీప నైవేద్యాలు కరువు

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:41 AM

మాన్యం భూములున్నా వీరభద్రుని ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. మండలంలోని వంకమద్ది గ్రామానికి కిలోమీరు దూరంలో వంకమద్ది చెరువుంది. చెరువు కట్ట పక్కనే ఓ గుట్టపైన రాయలవారు నిర్మించిన వీరభద్రస్వామి ఆలయం ఉంది.

Ancient temples

మాన్యం భూములున్నా నిరుపయోగం

చెరువు నిండితేనే పంటల సాగు

ప్రభుత్వం దృష్టిసారించాలంటున్న గ్రామస్థులు

నంబులపూలకుంట, అక్టోబరు 6: మాన్యం భూములున్నా వీరభద్రుని ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. మండలంలోని వంకమద్ది గ్రామానికి కిలోమీరు దూరంలో వంకమద్ది చెరువుంది. చెరువు కట్ట పక్కనే ఓ గుట్టపైన రాయలవారు నిర్మించిన వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఆలయంలో వీరభద్రుడు, శివాలయం, ఆరుబయట నాగలకట్ట ఉంది. ఆలయంలో ఎత్తైన రాతిపై భయంకర రూపంలో వీరభద్రుడు దర్శనమిస్తారు. అనేకమార్లు ఇక్కడ గుప్తనిధుల తవ్వకాలు చేపట్టారు. వీరభద్రుని పీఠాన్ని పక్కకు జరిపి ఆలయంలో కూడా తవ్వకాలు జరిపారు. స్వామివారి విగ్రహానికి ఎదురుగా నంది విగ్రహముంది. విగ్రహాన్ని ముక్కలుచేసి, పక్కనున్న చింతతోపులో పడేశారు. పురాతన ఆలయంలో గుప్తనిధులున్నాయని, గుప్తనిధుల వేటగాళ్లు పలుమార్లు తవ్వకాలు చేపట్టారు. వంకమద్ది గ్రామస్థులు రెండు సంవత్సరాల క్రితం ఆలయలో విగ్రహాలను పునఃప్రారంభించారు. ఆలయం వద్ద వంకమద్ది చెరువు మండలంలోని పెద్ద చెరువు. ఈచెరువు కింద మరికొమ్మదిన్నె, వంకమద్ది, ఎన్పీకుంటకు చెందిన రైతుల సాగుభూములున్నాయి. చెరువు విస్తీర్ణ 361 ఎకరాలుంది. నాలుగవందల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. ఒకసారి చెరువు నిండితే రెండు పంటలు పండుతాయి. నాడు శ్రీకృష్ణదేవరాయలు పాలనలో ఈచెరువు తవ్వారని, ఆలయాన్ని కూడా ఆయనే నిర్మించారని గ్రామ పద్దెలు చెబుతున్నారు.

ధూపదీప నైవేద్యాలు శూన్యం: వీరభద్రస్వామి ఆలయ భూములు ఆరు ఎకరాలున్నారు. గతంలో రెడ్డి, కరణాల చేతుల్లో ఉండేవి. సకాలంలో పంటలు పండకపోవడం, వర్షాలు సరిగా రాకపోవడంతో పంటలు సాగుచేసేవారు లేక భూములను బీడుగా వదిలేశారు. వర్షాలు కురిస్తే ప్రస్తుతం మాన్యం భూములను ఎవరోఒకరు సాగుచేసుకుంటున్నారేకానీ, దేవునికి ధూపదీప నైవేద్యాలకు ఇవ్వడంలేదు. పండుగ వస్తే ఇలవెల్పు కుటుంబసభ్యులు, భక్తులు వెళ్లి పూజలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 12:41 AM