COLLECTOR : నాణ్యమైన విత్తనాలనే ఇవ్వాలి
ABN, Publish Date - May 29 , 2024 | 11:42 PM
రైతులకు నాణ్యమైన విత్తన వేరుశనగను మాత్రమే సరఫరా చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. గుత్తి రోడ్డులోని విజయ ఆగ్రో సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను బుధవారం ఆయన తనిఖీ చేసి, విత్తన నాణ్యత, మొలక శాతాన్ని పరిశీలించారు. ప్రాసెసింగ్ యూనిట్‌లో విత్తన వేరుశనగ నాణ్యతను వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. 30 కేజీల బస్తాలో 4 శాతం మాత్రమే సహజ సిద్ధమైన వ్యర్థాలు ఉండాలని, అంతకు మించి ఉండరాదని అన్నారు. విత్తనాలు 70 శాతం ...
కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన, మే 29: రైతులకు నాణ్యమైన విత్తన వేరుశనగను మాత్రమే సరఫరా చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. గుత్తి రోడ్డులోని విజయ ఆగ్రో సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను బుధవారం ఆయన తనిఖీ చేసి, విత్తన నాణ్యత, మొలక శాతాన్ని పరిశీలించారు. ప్రాసెసింగ్ యూనిట్‌లో విత్తన వేరుశనగ నాణ్యతను వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. 30 కేజీల బస్తాలో 4 శాతం మాత్రమే సహజ సిద్ధమైన వ్యర్థాలు ఉండాలని, అంతకు మించి ఉండరాదని అన్నారు. విత్తనాలు 70 శాతం మొలకలు వచ్చేలా నాణ్యంగా ఉండాలని అన్నారు. కె-6తోపాటు ఇతర రకాల
విత్తనాల విక్రయాలను ప్రోత్సహించాలని సూచించారు. ఇందు కోసం కదిరి, కర్ణాటకలోని వ్యవసాయ పరిశోధన స్థానాలను పరిశీలించాలని, వచ్చే ఏడాదికి కె-6తోపాటు ఇతర రకాల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వాలి
కౌంటింగ్‌లో మార్గదర్శకాలను పాటించండి
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్
అనంతపురం టౌన, మే 29: కౌంటింగ్ విషయంలో ఎన్నికల కమిషన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు గురించి ఢిల్లీ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కౌంటింగ్‌కు సమయం దగ్గరపడిందని, ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలవారీగా
కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్‌లో ఎక్కడా మార్గదర్శకాలను అతిక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఖచ్చితమైన ఫలితాలు అందించాలని సూచించారు. ఎక్కడా అల్లర్లు జరగకుండా, శాంతిభద్రతలకు భంగం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మేం సిద్ధం..
జిల్లాలో జూన 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించడానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని నితీష్ వ్యాస్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. జేఎనటీయూలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామని, బ్యారికేడ్లు, సీసీ టీవీలు, ఫైర్ సేఫ్టీ, వాటర్ ప్రూఫింగ్‌కు ఏర్పాట్లు చేశామని వివరించారు. భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఇప్పటికే 133, 144 సెక్షనలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. కౌంటింగ్ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గౌతమిశాలి తెలిపారు. ఎలాంటి హింస జరగకుండా మొబైల్ పికెట్స్, మొబైల్ పార్టీలు, నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. కాన్ఫరెన్సలో జేసీ కేతనగార్గ్, జడ్పీ సీఈఓ నిదియ, నగరపాలిక కమిషనర్ మేఘస్వరూఫ్, రిటర్నింగ్ అధికారులు రాణీసుష్మిత, శ్రీనివాసులు రెడ్డి, వెన్నెల శ్రీను, గ్రంథి వెంకటేష్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 29 , 2024 | 11:42 PM