SAND MAFIA: జోరుగా ఇసుక అక్రమ రవాణా
ABN, Publish Date - Jun 30 , 2024 | 11:45 PM
మండలంలోని వేదవతిహగరి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని కళ్లుదేవనహళ్లి, సింగానహళ్లి, బొల్లనగుడ్డం తదితర గ్రామాల శివార్లలో ఉన్న నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బొమ్మనహాళ్, జూన 30: మండలంలోని వేదవతిహగరి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని కళ్లుదేవనహళ్లి, సింగానహళ్లి, బొల్లనగుడ్డం తదితర గ్రామాల శివార్లలో ఉన్న నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి ముడుపులు చెల్లిస్తూ ఇష్టానుసారంగా తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చెందిన మండల ప్రజాప్రతినిధి కనుసన్నల్లో వ్యాపారం జోరుగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తం మవుతున్నాయి. ఉరవకొండ, గుంతకల్లు, బళ్లారి ప్రాంతాలకు తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jun 30 , 2024 | 11:45 PM