ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SAND MAFIA: పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

ABN, Publish Date - May 31 , 2024 | 12:15 AM

కంబదూరు మండలంలోని నూతిమడుగు పెన్నానది పరివాహక ప్రాంతంలో గురువారం రాత్రి ఇసుకను తరలించేందుకు వచ్చిన టిప్పర్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో తవ్వకాలు జరిపి ప్రతి రోజూ రాత్రి సమయాల్లో ఇసుకను టిప్పర్ల సాయంతో అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరుకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.

The tipper came to move the sand

అడ్డుకున్న గ్రామస్థులు

కళ్యాణదుర్గం, మే 30: కంబదూరు మండలంలోని నూతిమడుగు పెన్నానది పరివాహక ప్రాంతంలో గురువారం రాత్రి ఇసుకను తరలించేందుకు వచ్చిన టిప్పర్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో తవ్వకాలు జరిపి ప్రతి రోజూ రాత్రి సమయాల్లో ఇసుకను టిప్పర్ల సాయంతో అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరుకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గురువారం రాత్రి అక్రమ తవ్వకాలను గ్రామస్థులంతా అడ్డుకుని వెంటనే తహసీల్దార్‌, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందించి గంటరన్నర దాటినా ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడలేదని వారు ఆరోపించారు. రోజూ రాత్రికి రాత్రే టిప్పర్ల సాయంతో ఇసుకంతా తోడేస్తున్నా సంబంధిత అధికారులకు తెలిసినా తమకు సంబంధం లేదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఆపకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.

Updated Date - May 31 , 2024 | 12:15 AM

Advertising
Advertising