ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Input subseedy: ఇనపుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం: కాలవ

ABN, Publish Date - May 24 , 2024 | 12:12 AM

రైతులకు ఇనఫుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అరకొర సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకుందని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని దేవగిరిక్రాస్‌లో గురువారం టీడీపీ నాయకుడు మల్లీడు శ్రీనివాసులు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలవ మాట్లాడారు.

Speaking Kalava Srinivas

బొమ్మనహాళ్‌, మే 23: రైతులకు ఇనఫుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అరకొర సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకుందని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని దేవగిరిక్రాస్‌లో గురువారం టీడీపీ నాయకుడు మల్లీడు శ్రీనివాసులు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలవ మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఇనఫుట్‌ సబ్సిడీలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలో రూ.1500 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేసిన ప్రభుత్వం అంత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయడంలో మాత్రం విఫలమైందన్నారు. ఈ సీజనలో ఇనఫుట్‌ సబ్సిడీ రైతులందరికి అందేలా చూడాలన్నారు.


నష్టపోయిన మిరపరైతులకు పరిహారం అందించాలన్నారు. ప్రస్తుతం విత్తన పంపిణీలో సబ్సిడీని పెంచాలని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన విత్తనాలను అందించాలని కోరారు. రైతుభరోసా కేంద్రాలలో మిరప విత్తనాలను కూడా సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు కొండాపురం కేశవరెడ్డి, బలరాంరెడ్డి, కొత్తపల్లి మల్లికార్జున, కుమ్మరి మల్లికార్జున, యర్రగుంట్ల వెంకటేశులు, ముల్లంగి నారాయణస్వామి, కొత్తపల్లి తిమ్మరాజు, సల్లాపురం బాబు, మాలపాటి ధనుంజయ, పయ్యావుల అనిల్‌, పయ్యావుల మోహన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 12:12 AM

Advertising
Advertising