ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MS : భూములకు రక్షణ లేకుండా చేసిన జగన

ABN, Publish Date - May 11 , 2024 | 12:06 AM

ముఖ్యమంత్రి జగన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తెచ్చి ప్రజల భూములకు రక్షణ లేకుండా చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు విమర్శించారు. ఓటు ద్వారా జగనకు బుద్ధి చెప్పా లని పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం అమరాపురం మండలంలోని వలస, తమ్మడేపల్లి, హలుకూరు, గౌడన కుంట గ్రామాల్లో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు హార తులతో ఘన స్వాగతం పలికారు.

MS Raju speaking in the campaign

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు

మడకశిర టౌన, మే 10: ముఖ్యమంత్రి జగన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తెచ్చి ప్రజల భూములకు రక్షణ లేకుండా చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు విమర్శించారు. ఓటు ద్వారా జగనకు బుద్ధి చెప్పా లని పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం అమరాపురం మండలంలోని వలస, తమ్మడేపల్లి, హలుకూరు, గౌడన కుంట గ్రామాల్లో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు హార తులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ...ముఖ్యమంత్రిగా చంద్రబాబు బా ధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ర ద్దు చేసే బాధ్యత తనదన్నారు.


వక్క రైతులకు స్థానికం గా మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఐదేళ్ల జగన పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, రాషా్ట్ర భివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ శాశ్వత అభివృద్ధి పని ఏదీ లేదన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఆగిపోయిన పది శాతం పూర్తి చేయలేక పో యారని విమర్శించారు. జగన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప పెత్తందారుల చేతిలో కీలు బొమ్మని, అం దరూ కలసి సిండికెట్‌గా ఏర్పడి తెచ్చుకున్న ఆయనకు అధికారం ఇస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో అలోచించా లన్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా పార్థసారథిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్ర మంలో మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, ఎస్సీ సెల్‌ ఆర్‌ జయకుమార్‌, నాయకులు గణేష్‌, ఉగ్రనరసింహ ప్ప, శివరుద్రప్ప, క్రిష్ణమూర్తి, మాజీ సర్పంచ విశ్వనాథ్‌, జనసేన, బిజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


మడకశిర రూరల్‌: మండలంలోని గౌడనహళ్లి పంచాయతీ గ్రామాల్లో శుక్రవారం టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽఽథి సతీమణి బీకే కమలమ్మ, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు సతీమణి ఎంఎస్‌ ఉమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి స్థానిక నాయకులు పూలమాలలతో, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. వారు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాల గుర్చి వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబునాయుడుతోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 11 , 2024 | 12:06 AM

Advertising
Advertising