ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BALAYYA : సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన

ABN, Publish Date - May 12 , 2024 | 12:08 AM

సొంత చెల్లి, తల్లికి న్యా యం చేయలేని దుర్మార్ఘుడు జగన అని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచార ము గింపు సందర్భంగా ఆయన శనివారం హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి నియోజకవర్గ వ్యా ప్తంగా వేల మంది తరలివచ్చారు. నంది సర్కిల్‌ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. అక్కడ బాల కృష్ణ మాట్లాడుతూ... అన్న అన్యాయం చేశాడు... తాము మోసపోయామంటూ సొంత చెల్లులు ఆరోపిస్తుంటే ఈ ముఖ్యమంత్రికి చెవికెక్కలేదన్నారు.

Balakrishna and Vasundhara Devi showing victory sign

రాష్ట్రానికి ఏం చేస్తాడు?

వైసీపీకి చుట్టంగా మారనున్న

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం

ఓటర్లు మేలుకోకపోతే సర్వనాశన ం

ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ

హిందూపురం, మే 11 : సొంత చెల్లి, తల్లికి న్యా యం చేయలేని దుర్మార్ఘుడు జగన అని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచార ము గింపు సందర్భంగా ఆయన శనివారం హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి నియోజకవర్గ వ్యా ప్తంగా వేల మంది తరలివచ్చారు. నంది సర్కిల్‌ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. అక్కడ బాల కృష్ణ మాట్లాడుతూ... అన్న అన్యాయం చేశాడు... తాము మోసపోయామంటూ సొంత చెల్లులు ఆరోపిస్తుంటే ఈ ముఖ్యమంత్రికి చెవికెక్కలేదన్నారు. తల్లి కూడా అతడి దెబ్బకు తట్టుకోలేక మన రాష్ట్రానికి రావడం మానేసిం దన్నారు ఇలాంటి సీఎం రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తా డో గ్రహించాలన్నారు.


వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో పేదల భూములన్నీ వైసీపీ నాయకు ల వశం అవుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే దాన్ని రద్దుచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించి సోమవా రం ఓటు వేయాలన్నారు. ప్రపంచంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి కార్యకర్తలు ఉన్నారని, వారున్నంత కా లం పార్టీ ఓ మహాశక్తిగా ఉంటుందన్నారు. నవరత్నాల పేరుతో జగన అక్క, చె ల్లెమ్మలను మోసం చేశారని, జే బ్రాండ్‌ మద్యంతో లక్షల మంది ప్రాణాలు పోయార న్నారు. చిలమత్తూరు మండలం వీరాపురాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు. పురంలో మళ్లీ అన్న క్యాంటిన ఏర్పాటుచేస్తామని, ప్రభుత్వాసు పత్రి రూపురేఖలు మార్చుతామని హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో నందమూరి వసుంధరాదేవి, టీడీపీ, బీజేపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


పురం పసుపు మయం

బాలకృష్ణ ర్యాలీ సందర్భంగా హిందూపురంలోని రహదారులన్నీ పసుపుమయంగా మారాయి. ఎక్కడ చూసినా జైబాలయ్య, చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. తెలుగుదేశం పార్టీ పాటలతో నాయకులు, కార్యకర్తలు నృత్యం చేశారు. చి న్నారుల నుంచి వృద్దుల వరకు రోడ్ల వెంబడి పసుపు జెండా పట్టుకుని ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన శ్రేణులతో హిందూ పురంలో శనివారం ఎన్నికల ప్రచారం ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది. ఇక్కడి నుంచి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మూడు సార్లు ఎమ్మె ల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నందమూ రి హరికృష్ణ ఒకసారి గెలిచిరు. ఇలాంటి నియోజకవర్గం లో ఎమ్మె ల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మూడో సారి బరిలో నిలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ పచ్చజెండా రెపరెపలాడుతోంది. ఇప్పటికే పది సార్లు టీడీపీ అభ్య ర్థులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు 11వ సారి ఎమ్మెల్యే బాలకృష్ణను గెలిపించేందుకు ఓట ర్లు సన్నద్ధం అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావి స్తున్నారు. ఆఖరి రోజు కావడంతో పట్టణంలో నిర్వహిం చిన ర్యాలీ పసు పుమయంగా మారింది. పార్టీ నాయకులు, అభిమానులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేసి హోరెత్తించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 12 , 2024 | 12:08 AM

Advertising
Advertising