BALAYYA: వైసీపీ అరాచకాలను అరికడదాం
ABN, Publish Date - May 08 , 2024 | 12:10 AM
రాష్ట్రంలో ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి వైసీపీ అరాచకాలను అరికడదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మంగళ వారం పట్టణంతో పాటు రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాల నంతా అరాచకాలు, అఘాయిత్యాలతో సాగిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింద న్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలు ప్ర జలకు ఎంతగానో అండగా నిలుస్తాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ
హిందూపురం, మే 7: రాష్ట్రంలో ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి వైసీపీ అరాచకాలను అరికడదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మంగళ వారం పట్టణంతో పాటు రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాల నంతా అరాచకాలు, అఘాయిత్యాలతో సాగిందన్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింద న్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలు ప్ర జలకు ఎంతగానో అండగా నిలుస్తాయన్నారు. హిందూ పురం మరింత అభివృద్ది జరగాలంటే టీడీపీ అధికా రంలోకి రావాల న్నారు. తాను మూ డో సారి బరిలో ఉ న్నానని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వ చ్చే ఐదేళ్లలో కేంద్రం సాయంతో మోడల్ నియోజకవర్గం గా తీర్చుదిద్దుతానన్నారు. నందమూరి బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ పాల్గొని ఓట్లను అభ్యర్థించారు.
లింగాయతలతో వసుంధరాదేవి సమావేశం
పట్టణంలోని కనకదాస కల్యాణమండపంలో మంగళ వారం వీరశైవ (లింగాయత) కులస్థులు, మహిళలతో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి సమావేశం నిర్వహించారు. టీడీపీ హయాంలో లింగా యతలకు పెద్ద పీట వేశామన్నారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటారన్నారు. లింగాయత కుల సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నందమూరి రామకృష్ణ ప్రచారం
చిలమత్తూరు/ హిందూపురం: నందమూరి బాలకృష్ణను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించు కుందామని బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఆయన బాల య్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి హైదరాబాదు నుంచి హిందూపురం వచ్చారు. కొడికొండ చెక్‌పోస్టులో టీడీపీ స్థానిక నాయకులు రంగారెడ్డి, చంద్రశేఖర్, సో మశేఖర్, బేకరీ గంగాధర్, నందీశప్ప, శివ, ప్రవీణ్ కు మార్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనం త రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హిందూపురం తరలివెళ్లారు. పట్టణంలోని బోయపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, ఎనబీకే ఫ్యాన్స నంబూరు సతీష్, హెచఎన రాము, సురేష్ తదితరలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 08 , 2024 | 12:10 AM