ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MEETING: టీ.. బిస్కెట్ల కోసమేనా సమావేశాలు?

ABN, Publish Date - Jun 10 , 2024 | 11:48 PM

టీ, బిస్కెట్లకోసమేనా సమావేశాలు నిర్వహించేది. గతంలో చెప్పిన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా సమాధానం చెప్పాలని వెంకటాపురం ఎంపీటీసీ శ్రీనివాసులు, సర్పంచ శంకర్‌రెడ్డి అధికారులను నిలదీశారు.

The MPTC Srinivas are deposing the officials

అధికారులను నిలదీసిన టీడీపీ ఎంపీటీసీ, సర్పంచ

ఓబుళదేవరచెరువు, జూన 10: టీ, బిస్కెట్లకోసమేనా సమావేశాలు నిర్వహించేది. గతంలో చెప్పిన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా సమాధానం చెప్పాలని వెంకటాపురం ఎంపీటీసీ శ్రీనివాసులు, సర్పంచ శంకర్‌రెడ్డి అధికారులను నిలదీశారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తుమ్మల పర్వీనషామీర్‌ అధ్యక్షతన సర్వసభ్యసమావేశం నిర్వహించారు. విద్యాశాఖపై ఎంఈఓ సురే్‌షబాబు మాట్లాడుతుండగా, సర్పంచ, ఎంపీటీసీలు జోక్యం చేసుకుని, దశాబ్దాలుగా వెంకటాపురం పంచాయతీలోని వీర ఓబున్నపల్లి పాఠశాల శిథిలావస్థకు చేరిందని, మరమ్మతు చేపట్టాలని పలుమార్లు మీదృష్టికి తీసుకొచ్చినా ఏమిచేశారని నిలదీశారు. ఆర్బీకే కేంద్రాల్లో ఎరువులుకూడా రైతులకు ఇచ్చేలా చూడాలని చింతమానుపల్లి సర్పంచ జగన్మోహనచౌదరి, ఏఓ ఇలియాజ్‌అహమ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. హార్టికల్చర్‌ అధికారి లావణ్యారెడ్డి, ఈఓఆర్‌డీ రాజశేఖర్‌, పశువైద్యాధికారి ప్రవీనకుమార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ విజయకుమారి, వైద్యాధికారి భానుప్రకా్‌షనాయక్‌ వారి వారి శాఖలపై మాట్లాడారు. ఎంపీడీఓ వరలక్ష్మి, ఏపీఓ సుధాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ, వివిధ శాఖల అధికారుల, ఎంపీటీసీలు, సర్పంచలు పాల్గొన్నారు. ఆర్టీసీ, రెవెన్యూ, పీఆర్‌, గృహణ నిర్మాణ, పట్టుపరిశ్రమ శాఖాధికారులు హాజరుకాకపోవడం గమనార్హం.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 11:48 PM

Advertising
Advertising